Begin typing your search above and press return to search.
యంగ్ హీరో సెక్యూరిటీ గార్డ్ ఘోరం చేశాడు
By: Tupaki Desk | 14 Nov 2015 9:01 AM GMTయువ కథానాయకుడు సాయిధరమ్ పేరు ఓ అనవసర వివాదంతో జనాల నోళ్లలో నానుతోంది. అతడి దగ్గర సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న దుబ్బాసి నాగేందర్ అనే వ్యక్తి ఘోరానికి పాల్పడ్డాడు. ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. 23 ఏళ్ల నాగేందర్ మెదక్ జిల్లా వాసి. హైదరాబాద్ లోని ఇందిరానగర్ బస్తీలో నివాసముంటున్నాడు. అక్కడే మూడో తరగతి చదివే ఓ పాప ఆడుకుంటుంటే.. తనకేదో చాక్లెట్ల ఆశ చూపించి ఆ అమ్మాయి ఇంటికి దగ్గర్లోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ముందు ఈ సంగతి ఎవరికీ తెలియలేదు.
ఐతే ఆ చిన్నారి ఆపకుండా ఏడుస్తుంటే ఇంట్లో వాళ్లు ఏం జరిగిందని విచారించగా.. పాప మాటల్ని బట్టి నాగేందర్ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని అర్థమైంది. బాధితులు వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నాగేందర్ ను అరెస్టు చేసి, జైలుకు తరలించారు. అతడి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు అంటున్నారు. నాగేందర్ సాయిధరమ్ దగ్గర సెక్యూరిటీ పర్సనల్ గా చేరి 10 రోజులే అయిందని సమాచారం. అతడి బ్యాగ్రౌండ్ అంతా పరిశీలించాకే తనను సాయిధరమ్ దగ్గర నియమించామని సెక్యూరిటీ ఏజెన్సీ అంటోంది.