Begin typing your search above and press return to search.
అమ్మ కు గిఫ్ట్ ఇచ్చిన మెగా హీరో
By: Tupaki Desk | 8 March 2018 12:44 PM GMTఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని అందరికి తెలిసిందే. మాములు ప్రజాలవే కాక సెలెబ్రెటీల పోస్టులతో సోషల్ మీడియా మొత్తం కలకళలాడిపోతోంది. ఇందులో అందరివీ బాగానే ఉన్నా ఒక మెగా హీరో పోస్ట్ మాత్రం అందరి దృష్టిని బాగా ఆకర్షించింది. అది ఎవరో కాదు సాయి ధరమ్ తేజ్.
సాయి ధరమ్ తేజ్ చిన్నప్పటి నుండి అమ్మ కూచినే. తనకు అమ్మే లోకమని అమ్మతో మాట్లాడకుండా ఉండలేనని చాలా ఇంటర్వ్యూలలో బయట పెడుతూనే వచ్చాడు. ఇప్పుడు మళ్లీ తన ప్రేమను మహిళ దినోత్సవం సందర్భంగా బయట పెట్టాడు. ఈ మెగా మేనల్లుడు పెట్టిన ఫోటో ఒకటి అందరి మన్ననలు పొందుతోంది. ఆ ఫోటో లో సాయి ధరమ్ తేజ్, అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్ వల్ల అమ్మకు ప్రేమతో ముద్దు పెడుతూ ఉన్నారు. ఈరోజు తను ఉన్నదంటే కారణం వల్ల అమ్మ అంటూ క్యాప్షన్ పెట్టి మహిళలందరికి తన శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇదే తన తల్లికి పర్ఫెక్ట్ గిఫ్ట్ అంటున్నారు అతని ఫ్యాన్స్. చాలాసార్లు పలు వేదికల్లో స్టేజీ మీదకు తన తల్లిని పిలిచి సత్కరించాడు సాయిధరమ్. తనకు వచ్చిన అవార్డును కూడా ఆమెకు ఇప్పించాడు. ఇలా వీలు చిక్కినప్పుడల్లా తల్లిపై ప్రేమను చాటుకుంటూనే ఉంటాడు.
ఇక ఇతని ప్రొఫెషనల్ కెరీర్ సంగతికి వస్తే ఈమధ్య కాలంలో ఫ్లోప్స్ తో డీలా పడిపోయిన తేజ్ చేతిలో కేవలం ఒక్క సినిమా మాత్రమే ఉంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపు దిద్దుకుంటున్న ఈ చిత్రానికి కరుణాకరన్ దర్శకత్వంలో వహిస్తుండగా అనుపమ పరమేశ్వరన్ మొదటి సారి ఈ మెగా హీరోతో జతకడుతోంది. కరుణాకరన్ ప్రేమ కథలు తీయడంలో సిద్ధ హస్తుడు కాబట్టి ఈ సినిమా పైన తెజూ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు.