Begin typing your search above and press return to search.

నా ఫ్యామిలీకి పవర్ స్టార్ జవాన్

By:  Tupaki Desk   |   20 Nov 2017 5:58 AM GMT
నా ఫ్యామిలీకి పవర్ స్టార్ జవాన్
X
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ లో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉందనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి - పవన్ కళ్యాణ్ స్టార్ స్టామినాతో సంపాదించుకున్న అభిమానులు వారి ఫ్యామిలీ నుండి వస్తోన్న ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్నారు. ఇక మెగా యువ హీరోలు కూడా వారికంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆ స్థాయిలో సాయి ధరమ్ తేజ్ చాలా కష్టపడుతున్నాడు. ఈ మధ్యన సినిమాలు అంతగా ఆడలేకపోతున్నా తన నటనలో డ్యాన్సులలో మాత్రం మెప్పిస్తున్నాడు.

ఇక మరికొన్ని రోజుల్లో జవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ మెగా హీరో. బివిఎస్.రవి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ వేడుకలో ఎవరి స్టైల్ లో వారు మాట్లాడారు. సాయి ధరమ్ తేజ్ కూడా తన మాటలతో అభిమానులను ఆకట్టుకున్నాడు. సాయి మాట్లాడుతూ.. వేడుకకి వచ్చినవారందరికి నా నమస్కారాలు. నా కోసం ఇంతమంది అభిమానులు వస్తారని అనుకోలేదు.

నిజంగా చెప్పాలంటే మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను ఇంద్ర సినిమా 175 డేస్ ఫంక్షన్ కి వెళ్ళినపుడు. నాకు కూడా ఈ తరహాలో అభిమానూలు వస్తారా? అని ఆలోచించాను. కానీ సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత మీ అభిమానం చూశాకా చాలా ఆనందాన్ని ఇచ్చింది. నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నానంటే మెగా స్టార్ - పవర్ స్టార్ పాత్ర ఎంతో ఉంది. ప్రతి ఇంట్లో ఒక జవాన్ ఉంటాడు. నా ఫ్యామిలికి పవర్ స్టార్ పెద్ద జవాన్. ప్రస్తుతం ఆయన చేస్తున్న కార్యక్రమాలకు చాలా గుర్తింపు లభిస్తోంది. ఆయనకు సెల్యూట్ చేయాల్సిందే అని సాయి ధరమ్ తేజ్ వివరించాడు.

ఇక సినిమా గురించి మాట్లాడుతూ నాకు ఈ కథ దర్శకుడు బివిఎస్.రవి గారు 2015లో వినిపించారు. జవాన్ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. దీంతో ఎలాగైనా సినిమాను చేయాలనీ డిసైడ్ అయ్యాను. థమన్ కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశాడు. సినిమా మొత్తం ఓ సారి చూసాక అసలు తీసింది మేమేనా అనుకున్నాం. థమన్ తో ఎక్కువ హిట్స్ కొట్టలేదని కానీ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చేవాడని సాయి చెప్పగా.. అందుకు థమన్ ఈ సారి తప్పకుండా హిట్టు కొడతాం మఛా అని సమాధానం ఇచ్చాడు. ఇక మెహ్రీన్ గోల్డెన్ లెగ్ అని చెబుతూ.. దేశ సైనికులను ఎక్కడా కించపరచకుండా చాలా బాధ్యతగా సినిమాను తీశామని సాయి ధరమ్ తేజ్ తెలిపాడు.