Begin typing your search above and press return to search.
రాజు గారూ.. నా చేయింకా మీ చేతిలోనే!
By: Tupaki Desk | 24 Aug 2015 4:31 AM GMTమెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్ తక్కువోడేమీ కాదు. చూడ్డానికి చాలా మొహమాటస్థుడిలా.. సిగ్గరిలా కనిపిస్తాడు కానీ.. వేదికెక్కి బాగానే మాట్లాడాడు. తనతో వరుసగా మూడు సినిమాలు చేస్తున్న దిల్ రాజు గురించి చెబుతూ.. ‘‘వైవీఎస్ చౌదరి గారు బొమ్మరిల్లు సినిమా ద్వారా నాకు నటుడిగా జన్మనిస్తే ఓ తండ్రిలా నా చేయి పట్టుకుని దిల్ రాజు గారి సంస్థ నన్ను నడిపించింది. దిల్ రాజు గారూ నా చేయి ఇంకా మీ చేతిలోనే ఉంది సార్’’ అంటూ బొమ్మరిల్లు డైలాగును గుర్తు చేసి నవ్వులు పండించాడు సాయిధరమ్. దిల్ రాజు సినిమా అంటే చాలు వెళ్లిపోతానని.. కథ గురించి, ఇంక దేని గురించీ తనకు పట్టింపు లేదని.. ఆ సంస్థలో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలనుందని తేజ్ చెప్పాడు.
తన మావయ్య చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ‘‘నాలుగైదు రోజులుగా పుట్టిన రోజు వేడుకలకు సంబంధించి చాలా బిజీగా ఉన్నారు మావయ్య. బాగా అలసిపోయారు. అందుకే ఆయన్ని ఫంక్షన్ కు పిలుద్దామా వద్దా అని మొహమాట పడ్డాను. అయినా వెళ్లి అడిగేశాను. మరో మాట లేకుండా డెఫినెట్ గా వస్తా.. నేనెందుకు రాను అన్నారు. టీవీ5 ఇంటర్వ్యూలో మావయ్యను ఏవో ప్రశ్నలు అడగాలనుకుని ఇంకేవో అడిగేశాను. నా మనసులో మాట ఇప్పుడు చెబుతా. మావయ్య 150వ సినిమాలో నాకొక్క చిన్న వేషం ఇస్తారా? జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఫ్రేమ్ వెనుక అలా కనిపించి వెళ్లిపోతా. అప్పుడే నా జీవితానికి సార్థకత వస్తుంది’’ అన్నాడు. డైరెక్టర్ హరీష్ శంకర్ తనను అన్నలా నడిపించాడని.. సినిమాలో తనలో కనిపించే ఎనర్జీ, యాటిట్యూడ్ అంతా హరీష్ దే అని.. తానీ పాత్ర చేయగలనా అన్న సందేహం ఉన్నా.. హరీష్ తనతో చాలా బాగా చేయించాడని సాయి చెప్పాడు. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాలో తన హెయిర్ స్టయిల్ గురించి చాలా కంప్లైట్లు వచ్చాయని.. హరీష్ తన హెయిర్ స్టయిల్ తో పాటు బాడీ లాంగ్వేజ్ మొత్తం మార్చేశాడని అన్నాడు. తనేంటి ఇంత అందంగా ఉండటమేంటి అని ఆశ్చర్యం కలిగేలా కెమెరామన్ రాంప్రసాద్ తనను చూపించాడని సాయి చెప్పాడు.