Begin typing your search above and press return to search.
పెద్ద మావయ్యను పర్మిషన్ తో 'సుప్రీమ్'
By: Tupaki Desk | 14 April 2016 5:24 PM GMT''సుప్రీమ్'' సినిమా పేరు వినగానే మొదటి అందిరికీ గర్తొచ్చేది.. మెగాస్టార్ చిరంజీవి గత టైటిల్. ఆయన్ను మెగాస్టార్ అనడానికి ముందు అందరూ సుప్రీమ్ హీరో అనేవారు. ఆయన బ్రేక్ డ్యాన్సులు చూసి.. ఆయన డైలాగ్ స్టయిల్స్.. ఆయన ఫైట్స్.. ఆయన గట్స్.. అన్నీ కలిపితే వచ్చింది ఆ టైటిల్. కాని సాయిధరమ్ తేజ్ మాత్రం సింపుల్ గా నాలుగో సినిమాకే మావయ్య టైటిల్ కొట్టేశాడు.
''అందరూ అనుకున్నట్లు నేను ఈ టైటిల్ అనుకున్నప్పుడు ఆనంద పడలేదు. భయం వేసింది. పెద్ద మావయ్య దగ్గరకు వెళ్ళాను. ఇలా సుప్రీమ్ అనే టైటిల్ ను అనుకుంటున్నా.. అని చెప్పగానే.. నేను చాలా కష్టపడితే ఆ పేరు వచ్చింది.. నువ్వూ కష్టపడి ఆ పేరును నిలబెట్టుకో అన్నారు. కేవలం చిరంజీవి గారి పేరును నిలబెట్టడానికి మాత్రమే నేను చాలా కష్టపడ్డాను. ఈ సినిమా కోసం ఎంత కష్టపడైనా కూడా ఆయన టైటిల్ తాలూకు గౌరవం కాపాడతాను'' అంటూ చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు. సో.. పర్మిషన్ తీసుకొని మరీ సుప్రీమ్ గా వస్తున్నాడంటే.. చాలా కాన్ఫిడెంటుగానే సినిమా చేశాడనమాట.
ఇకపోతే ఈ సినిమా డైరక్టర్ అనిల్ రావిపూడి వలనే సినిమా చాలా ఎనర్జటిక్ గా వచ్చిందని చెప్పుకొచ్చాడు కుర్రాడు. ''అనిల్ అన్న వలనే ఇంత ఎనర్జీ.. 50% నాదయితే.. 100% తనదే. అలాగే సాయి కార్తీక్ ఇచ్చిన ట్యూన్ల కేక'' అంటూ చెప్పాడు.