Begin typing your search above and press return to search.
పాపం మెగా హీరో ఎన్ని కష్టాలు పడ్డాడో!
By: Tupaki Desk | 10 Aug 2016 6:50 PM GMTమెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు సుప్రీమ్ హీరో అయిపోయాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి మంచి ఊపు మీదున్నాడు. కుర్ర హీరోల్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకోవడమే కాదు.. భారీ కలెక్షన్స్ అది కూడా స్టడీగా రాబట్టేస్తున్నాడు. ఇప్పుడంటే ఈ స్థాయి వచ్చింది కానీ.. గతంలో తాను డబ్బు కోసం ఎదుర్కున్న కష్టాలను గుర్తు చేసుకుని తెగ ఫీలయిపోయాడు తేజు.
ఈనెల 13న రిలీజ్ కానున్న తిక్క ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న తేజు.. తన మొదటి సినిమా రేయ్ ను కంప్లీట్ చేసిన టైమ్ లో రూపాయి కూడా చేతిలో లేని పొజిషన్ లో ఉన్నాడట. మొత్తం తన దగ్గర 30వేలు ఉంటే వాటితో జిమ్.. ట్రైనర్.. తమ్ముడి ఖర్చులతో సహా చూసుకోవాల్సి వచ్చిందట. మనోడికి అమ్మ దగ్గర డబ్బులు తీసుకోవడం ఇష్టం ఉండేది కాదట. అందుకే అడిగేవాడిని కాదని చెప్పాడు తేజు.
అలా కష్టపడుతు్న సమయంలో ఓ మీటింగ్ కోసం కారు బయటకు తీసి బయల్దేరాక.. కనీసం పెట్రోల్ కి కూడా డబ్బులు లేవని గుర్తొచ్చిందట. కానీ అదే సమయంలో తన అకౌంట్ కి 2 లక్షలు క్రెడిట్ అయ్యాయని.. అమ్మకి ఫోన్ చేస్తే కొడుకు కష్టాలను గమనించిన తనే పంపానని చెప్పిందట ఆమె. అమ్మ ప్రేమను తలుచుకుని ఆ పెట్రోల్ బంక్ లోనే కన్నీళ్లు పెట్టేసుకున్నాడట సుప్రీమ్ హీరో. పాపం.. మెగా హీరో ఎన్ని కష్టాలు పడ్డాడో కదా!