Begin typing your search above and press return to search.

మావయ్య బిరుదునే టైటిల్ గా మార్చేసుకున్నాడు

By:  Tupaki Desk   |   22 Sept 2015 9:23 AM IST
మావయ్య బిరుదునే టైటిల్ గా మార్చేసుకున్నాడు
X
వాడుకున్నోడికి వాడుకున్నంత అన్న స్టేట్మెంట్ సినిమా ఇండస్ట్రీకి సరిగ్గా సరిపోతుంది. మెగాస్టార్ వంశాన్ని ఒక స్థాయికి చేర్చిన చిరంజీవి తన తరువాతి తరంవారికి ఎన్నో విషయాలలో బాసటగా నిలిచారు. పవన్, నాగబాబు, బన్నీ తమ తమ సినిమాలలో ఇప్పటికే చిరంజీవిపై మమకారాన్ని పలు రూపాలలో చూపించారు.

అయితే ఇప్పుడీ వాడకాన్ని సాయి ధరమ్ తేజ్ కూడా అలవరుచుకున్నట్టు కనిపిస్తుంది. ఈవారం విడుదలకానున్న సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో ఇప్పటికే మెగాస్టార్ సూపర్ హిట్ సాంగ్ 'గువ్వా .. గోరింకతో'ని రీమిక్స్ చేసి మావయ్యని అనుకరించిన తేజ్ ఇప్పుడు తన తదుపరి సినిమా టైటిల్ కి ఏకంగా చిరంజీవి బిరుదునే వాడుకున్నాడు.

చిరు మెగాస్టార్ కంటే ముందు సుప్రీమ్ హీరోగా ప్రసిద్ధిగాంచాడు. ఈ మాస్ బిరుదుని తేజ్ - అనీల్ రావిపూడి ల కాంబినేషన్ లో రానున్న సినిమాకు టైటిల్ గా ఉపయోగించుకున్నారు . 'సుప్రీమ్ - డోంట్ సౌండ్ హార్న్' అనే టైటిల్ కమ్ ట్యాగ్ లైన్ ని అనీల్ ట్విట్టర్ లో ప్రకటించాడు. ఈ నెల 23న పూజా కార్యక్రమాలు మొదలుకానున్నాయి.