Begin typing your search above and press return to search.
మెగా హీరో వాడకం ఫస్ట్‌లుక్‌లోనూ!
By: Tupaki Desk | 15 Oct 2015 1:29 PM GMTతన ప్రతీ అడుగులోనూ మావయ్య చిరంజీవి మెగా ముద్ర స్పష్టంగా కనిపించాలనుకొంటున్నాడు సాయిధరమ్ తేజ్. అందుకే మావయ్యకి సంబంధించిన పాటల్ని, స్టైల్‌ని విచ్చలవిడిగా వాడేస్తున్నాడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాని చూసినవాళ్లకు ఆ విషయం మరింత స్పష్టంగా అర్థమైయ్యుంటుంది. చిరంజీవితో పాటు, పవన్‌కళ్యాణ్ స్టైల్‌ని కూడా వాడేశాడు. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆ డోసుని మరింత పెంచుతాడేమో అనిపిస్తోంది. ఇటీవల మొదలైన కొత్త సినిమా సుప్రీమ్‌లో యుముడికి మొగుడులోని పాటని రీమిక్స్ చేస్తున్న విషయం తెలిసిందే. తేజూ బర్త్‌డేని పురస్కరించుకొని విడుదలైన సుప్రీమ్ ఫస్ట్‌లుక్‌ని చూస్తే ఇంకా మావయ్య సరకును చాలానే వాడేసినట్టు అర్థమవుతోంది.
అనిల్ రావిపూడి దర్శకుడిగా సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా జంటగా సుప్రీమ్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. ఇదొక రోడ్ మూవీగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. సాయిధరమ్ తేజ్ ట్యాక్సీ డ్రైవర్ గెటప్‌లో కనిపించనున్నట్టు సమాచారం. ఆ గెటప్‌కి సంబంధించిన లుక్కునే తాజాగా విడుదల చేశారు. ఆ లుక్కులోనే మావయ్య సరకును బాగా వాడేసినట్టు అర్థమవుతోంది. ఆ ట్యాక్సీకి నెంబర్ 786గా ఉంది. అంటే చిరు నటించిన ఖైదీ నెంబర్ 786ని గుర్తుకు తెప్పించేలా ఆ నెంబర్‌ని వాడేశారన్నమాట. సాయిధరమ్ తేజ్ స్టైల్లోనూ మావయ్య పోలికలు, ఆ మేనరిజమ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాడకం మరీ ఎక్కువైతే కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుందని, ఆ విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సిందేనని సినీ పండితులు కొద్దిమంది చెబుతున్నారు.