Begin typing your search above and press return to search.
సుప్రీమ్ ని స్టార్ట్ చేసి సుబ్రమణ్యం..
By: Tupaki Desk | 7 Oct 2015 10:30 AM GMTసుబ్రమణ్యం ఫర్ సేల్ సక్సెస్ తో మంచి జోష్ మీదున్నాడు సుప్రీం హీరో సాయి ధరం తేజ్. సుబ్రమణ్యం తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ దాదాపు అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ కు వచ్చేశారు. ఓ సేఫ్ ప్రాజెక్ట్ చేయడం, దాన్ని అగ్రెసివ్ గా ప్రమోట్ చేయడం, ఇప్పటికే 17కోట్లకుపైగా షేర్ కలెక్ట్ చేయడంతో... తేజుకి ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఈజోష్ లోనే మరో మూవీ స్టార్ట్ చేసేశాడు కూడా. సుప్రీమ్ పేరుతో రూపొందుతున్న మూవీ షూటింగ్ ఇవాళే మొదలైంది. రాశిఖన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.
సుప్రీంలో సాయిధరం తేజ్ క్యాబ్ డ్రైవర్ పాత్ర పోషిస్తుండగా.. రాశి ఖన్నా ఖాకీ దుస్తుల్లో కనిపించబోతోంది. కెరీర్ స్టార్టింగ్ లోనే గ్లామర్ పాత్రల నుంచే పోలీస్ రోల్ కి టర్నింగ్ ఇఛ్చుకోవడంతో మంచి ఖుషీగా ఉంది ఖన్నా. ఇక సుప్రీమ్ మూవీని దిల్ రాజు నిర్మిస్తుండగా... పటాస్ ఫేం అనిల్ రావిపూటి డైరెక్షన్ చేస్తున్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో ప్రామిసిగ్ హీరో కావడం, టైటిల్ కూడా చిరంజీవిని గుర్తు చేసేదే కావడంతో.. ఇప్పటికే మూవీపై అంచనాలు మొదలైపోయాయి.
సుబ్రమణ్యంలోనే సుప్రీం హీరో కార్డ్ వేయించుకున్న సాయిధరం తేజ్.. ఇప్పుడు నేరుగా సుప్రీం అనే పేరుతోనే టైటిల్ చేస్తుండడం విశేషం. సుప్రీమ్ చిత్ర టైటిల్ కి తగిలించిన ఏసీ డీటీఎస్ అనే క్యాప్షన్ బాగా ఆకట్టుకుంటోంది. ఇది కూఢా ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టెయినర్ అంటున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. పటాస్ హిట్టు తరువాత మళ్ళీ సెకండ్ ఫిలింతో కూడా ఎటువంటి ఫ్లాపు సెంటిమెంటుకూ తావివ్వకుండా ఇరగదీస్తా అంటున్నాడు.