Begin typing your search above and press return to search.

తిక్కకి సర్టిఫికేట్.. ఇక తేల్చుకోవడమే

By:  Tupaki Desk   |   9 Aug 2016 8:16 AM GMT
తిక్కకి సర్టిఫికేట్.. ఇక తేల్చుకోవడమే
X
టైటిల్ దగ్గర నుంచి ఆకట్టుకున్న మూవీ తిక్క. టీజర్ నుంచి ట్రైలర్ వరకూ ఎక్కడా స్టోరీని ఒక్క ముక్క కూడా లీక్ కాకుండా కట్ చేయడం.. మరింత ఆసక్తిని కలిగించింది. ఆగస్ట్ 13న విడుదల చేసేందుకు నిర్ణయించిన ఈ మూవీని.. ఇప్పుడు సెన్సార్ చేయించేశారు నిర్మాతలు.

సెన్సార్ గండాన్ని సుప్రీం హీరో సాయిధరం తేజ్ నటించిన తిక్క.. యూ/ఏ సర్టిఫికేట్ తో పాస్ అయిపోయింది. ఓమ్ 3డీ ఫేమ్ సునీల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ఇప్పుడు అధికారికంగా రిలీజ్ కి అన్ని అడ్డంకులు తొలగించేసుకుని రెడీ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కానున్నా.. ఈ కుర్ర హీరోకి లోకల్ మార్కెట్ చాలా కీలకం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్.. సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచేస్తున్నాయి.

సెన్సార్ టాక్ ప్రకారం తిక్క సినిమాని డిఫరెంట్ గా తీర్చిదిద్దారు. ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ లో ఇచ్చే ట్విస్ట్.. ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందట. ఇక యాక్షన్ తో ఎంటర్టెయిన్మెంట్ డోస్ కూడా హై లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది. థమన్ అందించిన మ్యూజిక్ తిక్కకు మరో హైలైట్ కానుంది. ఈ మూవీ కోసం తమిళ స్టార్ హీరోలు ధనుష్, శింబులు చెరో పాట పాడడం మరో ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఇన్ని పాజిటివ్ అంచనాల మధ్య విడుదలవుతున్న తిక్క.. తేజు కెరీర్ లో స్పెషల్ గా నిలిచిపోనుంది.