Begin typing your search above and press return to search.

‘రేయ్’ రేంజిని దాటిపోయేలా ఉంది

By:  Tupaki Desk   |   13 Feb 2018 6:55 AM GMT
‘రేయ్’ రేంజిని దాటిపోయేలా ఉంది
X
సాయిధరమ్ తేజ్ కెరీర్లో అతడి అరంగేట్ర సినిమా ‘రేయ్’ రేంజిలో మరేదీ ఫ్లాప్ కాదనే అనుకున్నారంతా. కానీ ‘ఇంటిలిజింట్’ సినిమా దానికి దీటుగా నిలిచేలా కనిపిస్తోంది. ‘రేయ్’ సినిమా మీద వైవీఎస్ చౌదరి రూ.35 కోట్ల దాకా పెట్టుబడి పెట్టినట్లుగా చెప్పుకున్నాడప్పట్లో. ఐతే ఆ సినిమా ఫుల్ రన్లో రూ.5-6 కోట్ల మధ్య వసూళ్లు రాబట్టింది. కనీసం 20 శాతం కూడా పెట్టుబడిని వెనక్కి తేలేకపోయింది. ఐతే ‘రేయ్’కి నిజంగా అంత ఖర్చయిందా అనే విషయంలో సందేహాలున్నాయి. పైగా ఆ సినిమాకు బిజినెస్ చాలా తక్కువ జరిగింది. ఆ రకంగా చూసుకుంటే బయ్యర్లు మరీ ఎక్కువ స్థాయిలో నష్టపోయినట్లు కాదు. ఎక్కువ నష్టం చౌదరికే. ఐతే ఎలా చూసినా ‘రేయ్’ తేజు కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్. ఆ రికార్డును మరే సినిమా బద్దలు కొట్టలేదనే అనుకున్నారంతా. ఐతే ‘తిక్క’ సినిమా దానికి కొంచెం దగ్గరగా వెళ్లింది. ఐతే ఆ సినిమాకు ముందు తేజు వరుస హిట్లతో ఊపుమీదుండటంతో దానికి ఓపెనింగ్స్ పర్వాలేదనిపించాయి. కాబట్టి ‘రేయ్’ రికార్డును కొట్టలేదు.

ఐతే ఇప్పుడు సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ‘ఇంటిలిజెంట్’ మాత్రం ‘రేయ్’ నష్టాల రికార్డును బద్దలు కొట్టేసేలాగే అనిపిస్తోంది. ఈ చిత్రానికి తొలి వారాంతంలో వచ్చిన షేర్ రూ.3.13 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. బ్రేక్ ఈవెన్ కు రావాలంటే రూ.27-28 కోట్ల మధ్య వసూలు చేయాల్సిన సినిమా తొలి వారాంతంలో ఈ స్థాయి వసూళ్లు రాబట్టిందంటే అది ఏ స్థాయి డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి చూస్తుంటే ‘రేయ్’ను కొట్టేసి తేజు కెరీర్లో ఆల్ టైం డిజాస్టర్ గా ‘ఇంటిలిజెంట్’ నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.