Begin typing your search above and press return to search.
గీతా ఆర్ట్స్ లో మళ్లీ సాయి
By: Tupaki Desk | 29 May 2018 11:22 AM GMTమెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లక్ ఏమిటో గాని ఎన్ని డిజాస్టర్స్ వచ్చినా ఆఫర్స్ మాత్రం దక్కడం లేదు. పోయే సినిమాలు పోతూనే ఉన్నాయి. వచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి. గత కొంత కాలంగా చూసుకుంటే సాయి కి అందిన అవకాశాలు మారే హీరోకి దక్కలేదనే చెప్పాలి. గత ఏడాది లానే ఈ సారి కూడా వరుసగా సినిమాలను ఒకే చేస్తున్నాడు. త్వరలో తనకు లైఫ్ ఇచ్చిన మొదటి బ్యానర్ లో ఈ మెగా అల్లుడు మరోసారి కనిపించనున్నాడట.
పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో కెరీర్ స్టార్టింగ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్.. ఆ తరువాత సొంతంగా తనకంటూ ఒక స్టార్ డమ్ క్రియేట్ చేసుకున్నాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా వివిధ రకాల ప్రొడక్షన్స్ లో పని చేశాడు. అయితే చాలా కాలం తరువాత మళ్లీ గీత ఆర్ట్స్ నుంచి ఈ హీరో పిలుపు అందుకున్నాడు. వెంకీ కుడుములతో గీత ఆర్ట్స్ ఒక ప్రాజెక్ట్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఛలో సినిమా హిట్ అవ్వగానే గీత ఆర్ట్స్ ముందే అతన్ని బుక్ చేసుకోగా వెంకీ తన కథకు సాయి ధరమ్ తేజ్ ని అనుకున్నాడట.
ఇక సాయి కూడా కథ వినగానే ఎలాంటి కండిషన్స్ లేకుండా ఒప్పుకున్నాడు. అది సెట్ అవ్వకుంటే శ్రీకాంత్ అడ్డాల ప్రాజెక్టును లాక్ చెయ్యాలని చూస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల శర్వానంద్ కాంబినేషన్ గురించి మొన్నటి వరకు కథనాలు బాగానే వచ్చాయి. మరి గీతా వారు శర్వా సినిమా చేస్తారా? మెగా మేనల్లుడి సినిమా చేస్తారా? రెండూ చేస్తారా?