Begin typing your search above and press return to search.
సుప్రీమ్ హీరో కాళ్ళు మొక్కిన వేళ
By: Tupaki Desk | 1 Feb 2018 7:28 AM GMTఅభిమానులు సినిమా హీరోల మీద ఎంత ప్రేమ కురిపిస్తారో ఒకోసారి వాళ్ళు చేసే పనుల వల్ల ఇబ్బందులు కూడా ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. తమిళనాట ఇది మరీ హద్దులు దాటడం గతంలో చాలా సార్లు చూసాం. హీరోల కోసం కటౌట్లు, దండలు, బ్యానర్లు వేయటం ఎక్కడైనా సహజమే కాని ఏకంగా గుళ్ళు కట్టడం మాత్రం అరవ ఫాన్స్ కే సాధ్యం. ఖుష్బూ, హన్సిక, నమిత ఇలాంటివాళ్ళకు కట్టినంత పని చేసారు. ఇక రజనికాంత్ లాంటి సూపర్ స్టార్ల సంగతి సరేసరి. మొన్నా మధ్య తానా సేంద్ర కూట్టం ఫంక్షన్ లో హీరో సూర్య కాళ్ళ మీద అభిమానులు సాష్టాంగ నమస్కారం చేస్తుంటే మాటలతో చెప్పి లాభం లేదని గమనించి తను కూడా రివర్స్ లో వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి ఒక్క దెబ్బతో అందరిని సెట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యింది. తమ ఇష్టమైన నటుడి కాళ్ళు తాకితే ఏదో లభిస్తుంది అనే ఫీలింగ్ లో వాళ్ళు చేసే ఇలాంటి పనులు నిజానికి హీరోలకు కష్టంగా ఉంటుంది.
సరిగ్గా అలాంటి పరిస్థితి సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ కు కూడా ఎదురైంది. ఇప్పుడిప్పుడే సెటిల్ అవ్వడానికి కష్టపడుతున్న సాయికి ఒ అభిమాని కాళ్ళకు మొక్కబోతే అతను కూడా ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే తిరిగి మొక్కడంతో మిగిలిన ఫ్యాన్స్ గప్ చిప్ గా షేక్ హ్యాండ్, ఫోటోతో సరిపెట్టుకున్నారు. నిజానికి వయసులో చిన్నవాడే అయిన సాయి ధరం తేజ్ లాంటి హీరోల కాళ్ళకు నమస్కరించడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. కాని చూసిన ఆనందంలో తమ అభిమానాన్ని వ్యక్తపరిచే క్రమంలో ఇలా చేయటం తెలిసి చేసే తప్పు కానప్పటికీ ఇలా రివర్స్ కౌంటర్ ఇవ్వడం మాత్రం సబబే.
ఇప్పుడు సాయి చేసిన పనిని చూసి సూర్య నుంచి స్ఫూర్తి పొంది ఇలా చేసాడేమో అని పోలిక పెడుతున్నారు నెటిజెన్లు. మరి మంచిగా అయ్యా బాబు - మొక్కకండి అని చెబితే విననప్పుడు నొప్పించకుండా చెప్పడంలో ఇంత కన్నా మార్గం లేదు అనిపిస్తుంది. సాయి ధరం తేజ్ 9న రాబోతున్న ఇంటెలిజెంట్ ఫలితం గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. హ్యాట్రిక్ ఫ్లాప్ తర్వాత ఇది మళ్ళి బూస్ట్ లాగా హిట్ ఇస్తుందని నమ్ముతున్నాడు. వివి వినాయక్ దర్శకుడు కాబట్టి తనను ఎక్కువ ఇష్టపడి మాస్ ని మెప్పిస్తాడో లేదో వచ్చే వారం తేలనుంది.