Begin typing your search above and press return to search.

రేపటి నుంచి ఖైది150.. నాన్ ఖైది150

By:  Tupaki Desk   |   10 Jan 2017 5:16 PM GMT
రేపటి నుంచి ఖైది150.. నాన్ ఖైది150
X
ఇప్పటివరకూ ఒక లెక్క.. టాలీవుడ్ రికార్డుల ఇవాల్టి నుంచి ఒక లెక్క అనే విషయం అర్ధమైపోతూనే ఉంది. ఏరికార్డు గురించి మాట్లాడుకున్నా.. బాహుబలి రికార్డులు.. నాన్ బాహుబలి రికార్డులు అనే మాట్లాడుకోవాల్సి వచ్చింది. కానీ మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 తర్వాత ఈ లెక్కలన్నీ మారిపోనున్నాయి. ఈ విషయం ఎవరో కాదు.. చిరు మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరం తేజ్ స్వయంగా ట్వీట్ చేయడం విశేషం.

సరిగ్గా రిలీజ్ కు ముందు రోజున.. 'నేటి వరకు బాహుబలి - నాన్ బాహుబలి రేపటి నుంచి ఖైది150 - నాన్ ఖైది150' అంటూ ఖైదీ నంబర్ 150 రికార్డులను ఉద్దేశించి ట్వీట్ చేశాడు తేజు. తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న మెగా మేనియా చూస్తుంటే.. ఇది నిజమే అని అర్ధమైపోతోంది. రెండు రాష్ట్రాల్లోని మొత్తం అన్ని థియేటర్లలోనూ రేపు కేవలం ఖైదీ మాత్రమే ప్రదర్శితం కానుంది. అదొక్కటి చాలు.. బాక్సాఫీస్ రికార్డులను బాస్ ఏ రేంజ్ లో షేక్ చేయనున్నాడో తెలియడానికి.

ముందుగా అయితే.. మొదటి రోజు కలెక్షన్స్ ను సోలోగా దున్నేసే అవకాశం రావడం ఖైదీ నంబర్ 150కి అన్నిటికంటే కలిసొచ్చే పాయింట్. పైగా సంక్రాంతి సెలవలు కావడంతో.. వీకెండ్ వచ్చేసరికి టాలీవుడ్ రికార్డులన్నీ మెగాస్టార్ తన పేరిట రాసేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/