Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో మరో వికెట్ పడింది: హీరో ట్వీట్ వైరల్

By:  Tupaki Desk   |   14 May 2020 10:30 AM GMT
ఇండస్ట్రీలో మరో వికెట్ పడింది: హీరో ట్వీట్ వైరల్
X
టాలీవుడ్ యంగ్‌ హీరో నిఖిల్‌ ఈరోజు ఓ ఇంటి వాడయ్యాడు. ఈరోజు ఉదయం 6 గంటల 31 నిమిషాలకు తాను ప్రేమించిన పల్లవి వర్మను తాళి కట్టి తనవశం చేసుకున్నాడు. ఏప్రిల్ 16న జరగాల్సిన ఈ జంట వివాహం కరోనా వల్ల వాయిదా పడింది. అయితే ఇంకా లాక్ డౌన్ ముగియకపోవడంతో.. లాక్ డౌన్ ముగిసేసరికి మూఢాలు వస్తాయని తెలియడంతో అనుకున్నట్లుగా మే 14న వివాహ తంతు ముగించారు. సామాజిక దూరంగా పాటిస్తూ.. కుటుంబీకులు సన్నిహితుల మధ్య శామీర్ పెట్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెళ్లి జరిగింది. ఇక హీరో నిఖిల్.. భార్య పల్లవి వర్మ మెడలో తాళి కట్టిన అనంతరం సంప్రదాయబద్ధంగా ఆమెకు అరుంధతి నక్షత్రం చూపాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను హీరో సాయిధరమ్ తేజ్ పోస్ట్ చేసి ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

సాయి తేజ్ ట్వీట్ చేస్తూ.. 'టాలీవుడ్ లో మరో వికెట్‌ డౌన్‌ అయింది. జీవితంలో అతి పెద్ద అడుగు ముందుకు వేసినందుకు నిఖిల్‌కి శుభాకాంక్షలు. మీ జీవితంలో హ్యాపీడేస్‌ నిండాలని నేను కోరుకుంటున్నాను. ఇక నీ జీవితంలో ప్రతి రోజు మరింత ప్రత్యేకంగా, సరదాగా సాగిపోవాలని ఆశిస్తున్నాను' అంటూ తన స్టైల్ లో శుభాకాంక్షలు తెలిపాడు. ఇక సాయిధరమ్ తేజ్‌ చేసిన ట్వీట్‌పై స్పందించిన సినీనటుడు బ్రహ్మాజీ.. 'ఎంజాయ్‌ చేస్తున్నావా తేజూ.. ఒక్కో వికెట్‌ పడిపోతుంటే..' అంటూ సరదాగా ప్రశ్నించాడు. బ్రహ్మాజీ ట్వీట్ కి బదులిస్తూ.. "భయం వేస్తుంది భాజీ.. అని రిప్లై ఇస్తే.. ఆ తప్పు అసలు చేయకు.. దొరికిపోతావ్ అని" బ్రహ్మాజీ మళ్లీ సరదాగా బదులిచ్చాడు. ఇక ఈ ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి తంతు ముగిసిందని తెలిసినప్పటి నుండి టాలీవుడ్ హీరోలు, ప్రముఖులు నిఖిల్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.