Begin typing your search above and press return to search.

తప్పును ఒప్పుకొని సరిదిద్దుకుంటానన్న హీరో

By:  Tupaki Desk   |   26 Jan 2021 3:50 PM GMT
తప్పును ఒప్పుకొని సరిదిద్దుకుంటానన్న హీరో
X
లక్షల మంది అభిమానించే తారలు చాలా జాగ్రత్తగా పోస్టులు పెడుతారు. ఏమాత్రం తేడా కొట్టినా నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటారు. ట్రోల్స్, మీమ్స్ తో కడిగిపారేస్తారు. ఈ క్రమంలోనే చాలా మంది సెలెబ్రెటీలు అస్సలు కామెంట్స్ ను పట్టించుకోకుండా ముందుకెళుతారు. వాటిని చూసి చూడనట్టుగా ఉంటారు. అయితే నెగెటివ్ కామెంట్స్ చేసినా కూడా సానుకూలంగా తీసుకునే మనస్తత్వం అందరికీ ఉండదు.కానీ మన మెగా హీరో సాయిధరమ్ తేజ్ మాత్రం ఓ నెటిజన్ తన గురించి చేసిన కామెంట్ కు బాధపడకుండా తప్పును దిద్దుకుంటానని వినమ్రంగా చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

నిన్న సాయిధరమ్ తేజ్ హీరోగా 'రిపబ్లిక్' చిత్రం మోషన్ పోస్టర్ ఈయన వాయిస్ తో విడుదలైంది. 'ప్రజాస్వామ్యం నిలబడాలంటే చట్టం, న్యాయం, ధర్మ సమంగా నిలబడాలని.. అదే అసలైన రిపబ్లిక్' అని సాయిధరమ్ వాయిస్ ఓవర్ తో గ్రాఫిక్స్ తో మూడు గుర్రాలను రథాన్ని పెట్టి చూపించారు.

అయితే ఈ మోషన్ పోస్టర్ మీద ఓ నెటిజన్ స్పందించాడు. 'ప్రభుత్వ ఉద్యోగులు' అనే మాటను సాయిధరమ్ సరిగా పలకలేకపోయాడని.. దర్శకుడు దేవాకట్ట సినిమాల్లో డైలాగులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలని సూచిస్తూ ఓ ట్వీట్ చేశాడు.

అయితే తన వాయిస్ మిస్ అయినందుకు ఏ హీరో అయినా బాధపడుతాడు.కానీ సాయిధరమ్ మాత్రం వినమ్రంగా ఆ నెటిజన్ కు బదులిచ్చాడు. తనలోని ఈ లోపాన్ని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు అని.. దాని మీద పనిచేస్తానని ఆ నెటిజన్ పేరు పెట్టి మరీ ట్వీట్ చేయడం గమనార్హం. తప్పును సైతం ఒప్పుకొని సరిదిద్దుకుంటానన్న హీరో గారి ధైర్యానికి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.