Begin typing your search above and press return to search.
మెగా కుర్రాడు.. వాడకంలో తగ్గలేదు
By: Tupaki Desk | 5 May 2016 1:48 PM GMTతన మెగా మావయ్యలిద్దరినీ వాడుకునే విషయంలో సాయిధరమ్ తేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. అనుకున్నట్లే ‘సుప్రీమ్’లో సైతం మెగాస్టార్ చిరంజీవిని.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఫుల్లుగా వాడేశాడు సాయిధరమ్ తేజ్. చిరంజీవి పాట ‘అందం హిందోళం’ రీమిక్స్ పాట మెగా అభిమానులకు స్పెషల్ ట్రీటే.
ఈ పాటలో చిరు.. పవన్.. సాయిధరమ్.. ముగ్గురూ కలిసి కనిపించడం విశేషం. పాట మధ్యలో ఉన్నట్లుండి ఎటో చూస్తూ ఎగ్జైట్ అవుతాడు సాయిధరమ్. కట్ చేస్తూ ‘బ్రూస్ లీ’ సినిమాలో చిరు గుర్రం ఎక్కే షాట్ కనిపిస్తుంది. తర్వాత వెంటనే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గుర్రం మీద దూసుకొస్తాడు. ఈ రెండు దృశ్యాల్నిస్ప్లిట్ చేసి.. సాయిధరమ్ గుర్రం మీద దూసుకొస్తున్న దృశ్యం చూపిస్తారు. బ్యాగ్రౌండ్లో అరుపులు.. కేకల స్పెషల్ ఎఫెక్టు కూడా యాడ్ చేశార్లెండి.
ఇక ‘సుప్రీమ్’ అంటూ చిరంజీవి బిరుదునే టైటిల్ గా వాడేయడమే కాదు.. సుప్రీమ్ కథ.. సాయిధరమ్ క్యారెక్టర్.. చూసినా మెగాస్టార్ సినిమాల స్ఫూర్తి కనిపిస్తుంది. పసివాడి ప్రాణం స్ఫూర్తితో అనిల్ రావిపూడి ఈ కథ రాసుకోవడం విశేషం. అందులో.. ఇందులో.. ఓ పిల్లాడి చుట్టూనే కథ సాగుతుంది. ‘గ్యాంగ్ లీడర్’ను తలపించేలా ట్యాక్సీ డ్రైవర్ పాత్రను పోషించాడు సాయిధరమ్. డ్యాన్సులు.. ఫైట్లు.. మేనరిజమ్స్ అన్నింట్లోనూ చిరంజీవిని.. పవన్ కళ్యాణ్ ను చాలాసార్లు గుర్తుకు తెచ్చాడు మెగా మేనల్లుడు. అతడి పెర్ఫామెన్స్ మెగా అభిమానుల్ని బాగానే అలరించేలా ఉంది. ఐతే అతి సర్వత్ర వర్జయేత్ అంటారు కాబట్టి.. ఇక ఈ మావయ్యల అనుకరణకు తెరదించేస్తే బెటర్.