Begin typing your search above and press return to search.

చిన మావయ్యను కూడా వాడేసుకున్నాడు

By:  Tupaki Desk   |   5 Feb 2018 6:30 PM GMT
చిన మావయ్యను కూడా వాడేసుకున్నాడు
X
వరుణ్ తేజ్ తన సినిమా కోసం బాబాయ్ పవన్ కళ్యాణ్ ఆల్ టైం సూపర్ హిట్ మూవీ టైటిల్ తొలిప్రేమను వాడేసుకుంటే దానికి పోటీగా వస్తున్న ఇంటెలిజెంట్ తో సాయి ధరం తేజ్ తాను కూడా తక్కువ తినలేదని నిన్న ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఇప్పటి దాకా మెగాస్టార్ చిరంజీవి పాటలనే వాడుకుంటూ వచ్చిన సాయి ధర్మ తేజ్ ఈ సారి చిన మావయ్య పవన్ కళ్యాణ్ స్టైల్ - డ్రెస్సులను కూడా తీసుకోచ్చేసాడు. ట్రైలర్ లో రెండు చోట్ల పవర్ స్టార్ రెఫరెన్సులు వాడుకున్నాడు సాయి. 16 ఏళ్ళ క్రితం వచ్చిన ఖుషి సినిమాలో పవన్ తన ఇంట్రోలో కరాటే డ్రెస్ లో కనిపిస్తాడు. అప్పుడు ఆలి పరిగెత్తుకుంటూ వచ్చి ఏదో ముంచుకొచ్చిందని చెవిలో చెబుతాడు. సరిగ్గా అదే గెటప్ ని వాడేసుకుని ఇంచుమించు అదే బ్యాక్ డ్రాప్ ని వెనుకగా చూపించి హీరో ఫ్రెండ్ రాహుల్ రామకృష్ణతో ఫ్రెండ్ ని కొట్టినవాడిని ఏమి చేయవా అని నిలదీయటం వద్దన్నా పోలికను గుర్తు చేస్తోంది.

ఇక పూరి జగన్నాధ్ ఫస్ట్ మూవీ బద్రిలో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సాంగ్ ఒకటి ఉంది. ఏ చికితా కుమోస్తాస్ అనే పాటలో పవన్ కౌ బాయ్ గెటప్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. అదే గెటప్ అచ్చు గుద్దినట్టు దించేసినట్టు ట్రైలర్ చివర్లో చూపించారు. నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వినాయక్ అదే పనిగా తాను తేజుని చిరులా - పవన్ లా చూపించాను అని చెప్పడం బహుశా దీని గురించే కావొచ్చు.ఇలా సినిమాలో మెగా వాడకం బాగానే జరిగినట్టు కనిపిస్తోంది. ,మరో ట్విస్ట్ ఏంటంటే డిజే సినిమాతో స్పిన్నర్ కు పాపులారిటీ తెచ్చిన అల్లు అర్జున్ ని కూడా వదల్లేదు తేజు. పోసాని డెన్ లో ఒక ఫైట్ మొత్తం సాయి స్పిన్నర్ తిప్పుతూనే చేస్తాడు. అది కూడా ట్రైలర్ లోనే గమనించవచ్చు.

అన్ని బాగానే ఉన్నాయి కాని ఈ అనుకరణలు - కాపీలు సినిమా బాగుంటేనే కాపాడుతాయి. ట్రైలర్ రెగ్యులర్ గా ఉందని ఇప్పటికే టాక్ వచ్చిన నేపధ్యంలో మేకింగ్ లో ఇంటలిజెన్స్ ఏమైనా చూపించారేమో సినిమాలో చూడాలి. చమక్ చమక్ లో చిరు, ఇలా స్టైలింగ్ లో పవన్ మొత్తానికి మావయ్యలను వాడుకోవడంలో అల్లుడు తర్వాతే ఎవరైనా అని సాయి ధరం తేజ్ మరోసారి ఋజువు చేసాడు