Begin typing your search above and press return to search.

మెగా అల్లుడికి గర్ల్ ఫ్రెండ్ లేదంట

By:  Tupaki Desk   |   27 Nov 2017 1:42 PM GMT
మెగా అల్లుడికి గర్ల్ ఫ్రెండ్ లేదంట
X
టాలీవుడ్ లో రూమర్ నుంచి ఇంత వరకు ఏ హీరో తప్పించుకోలేదు. అయితే అందులో కొన్ని నిజాలు ఉంటాయి అలాగే మరికొన్ని అవాస్తవాలు కూడా ఉంటాయి. కానీ బలంగా ఉండే కొన్ని రూమర్స్ చాలా వరకు అనుమానాలను కలిగిస్తాయి. చివరకు వారు కండించే వరకు వారిని వెంటాడుతూనే ఉంటాయి. అయితే మెగా హీరోలపై కూడా రూమర్స్ ఏ రేంజ్ లో వచ్చేయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ముఖ్యంగా మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ పై కొంచెం తీవ్ర స్థాయిలోనే రూమర్స్ వచ్చాయి. అయితే ఆ విషయాలు చాలా వరకు ఆ హీరోను కొంచెం బాధను కలిగించాయి. కానీ అన్ని రూమర్స్ ని ఎదుర్కొన్న సాయికి గర్ల్ ఫ్రెండ్స్ అసలు లేరా అని చాలా రోజుల నుంచి అతను ఎదుర్కొంటున్న ప్రశ్న. అయితే ఆ విషయంపై సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా వివరణ ఇచ్చాడు. జవాన్ ప్రమోషన్స్ లో పాల్గొన్న సాయి ఆ విషయం గురించి ప్రస్తావించాడు.

'నేను సింగిల్ నాకు నిజంగా గర్ల్ ఫ్రెండ్స్ లేరు. మా కాలనీ లో కూడా అంతగా అమ్మాయిలు ఎవరు లేరు. దాదాపు అందరు పెళ్లైన వారే ఉన్నారు. ఇక నేను ఒక అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ గా సెలెక్ట్ చేసుకోవాలంటే.. ఆమెను గుర్తించడం చాలా కష్టమైన పనిగా భావిస్తాను' అని సాయి వివరించాడు. చూస్తుంటే హీరోయిన్ రెజీనా ఫ్యాన్స్ అందరూ ఈ కామెంట్స్ తో పుల్ ఖుషీ చేసుకోవచ్చు అంటున్నారు నెటిజన్స్. మెగా మేనల్లుడి మాటలు అలాగే ఉన్నాయిలే.

ఇక ఈ హీరో నటించిన జవాన్ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. వివిఎస్.రవి దర్శకత్వం వహించిన ఆ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది.