Begin typing your search above and press return to search.

కటౌట్ కాదు రాజా.. కంటెంట్ ముఖ్యం

By:  Tupaki Desk   |   3 March 2018 4:39 AM GMT
కటౌట్ కాదు రాజా.. కంటెంట్ ముఖ్యం
X
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన కెరీర్ లోనే ఇప్పుడు అత్యంత కష్టమైన టైంను ఫేస్ చేస్తున్నాడు. ఒకానొక టైంలో వరస హిట్లతో తారాజువ్వలా దూసుకెళ్లిన తేజు ఇప్పుడు వరస ఫ్లాపులతో రేసులో బాగా వెనుకబడిపోయాడు. ఎన్నో ఆశలు పెట్టుకుని మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తో చేసిన ఇంటిలిజెంట్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాజ్టర్ గా నిలిచి కెరీర్ కు మరింత చెడు చేసింది.

ఇలాంటి తరుణంలో మెగా ఫ్యాన్స్ కు మెప్పించడం కోసం తన తరవాత సినిమా ఆడియో ఫంక్షన్ కు ఏదోరకంగా పవన్ కళ్యాణ్ ను తీసుకురావాలని తేజు ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ సినిమాలను పక్కనెట్టి పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టడంతో అతడెంత వరకు ఈ ఫంక్షన్ కు వస్తాడో అన్నది డౌటే. అయినా తేజు సినిమాలు వరసగా ఫ్లాప్ అయింది అభిమానుల అండ లేక కాదు. సినిమాల్లో సరైన కంటెంట్ లేక. అర్ధం లేని కథ.. విసుగు తెప్పించే స్క్రీన్ ప్లేతో సినిమా తీస్తే దానికి ప్రేక్షకాదరణ దక్కడం అనేది కలలోని మాట. ఆడియో ఫంక్షన్ కు పవన్ వస్తే ఈ ఊపుతో మొదటి రోజు కాస్త కలెక్షన్లు వస్తాయి. కానీ రెండో రోజు నుంచి సినిమాను నిలబెట్టేది కథ.. సినిమాలోని కంటెంటే.

తేజు సినిమాలకు రికార్డు రేట్ పలికినా.. మంచి ఓపెనింగ్స్ వచ్చినా అదంతా మెగా ఫ్యాన్స్ నుంచి వస్తున్న సపోర్టేనని చెప్పక తప్పదు. మామయ్యలు అతడి గురించి నెగిటివ్ గా కామెంట్ చేసిందే లేదు. అలాంటప్పుడు తనకున్న అనుబంధాన్ని పనికట్టుకుని గుర్తు చేయడం కన్నా కథలో కంటెంట్ మీద ఫోకస్ పెడితే బెటర్. మెగా ఫ్యామిలీ హీరో ట్యాగ్ లైన్ ఇప్పటికీ అలాగే ఉంది. సింగిల్ ముక్కలో చెప్పాలంటే కంటెంట్ బాగోలేకపోతే పవన్ సినిమాయే జనాలు చూడరు. అలాంటప్పుడు పవన్ చెప్పాడని ఎలా చూస్తారు? కటౌట్ కాదు రాజా.. కంటెంట్ ముఖ్యం. తేజు ఈ విషయం ఆలోచిస్తే బెటరేమో!!