Begin typing your search above and press return to search.

మెగా నందమూరి ఫ్రెండ్ షిప్ అదిరింది

By:  Tupaki Desk   |   29 April 2016 4:34 AM GMT
మెగా నందమూరి ఫ్రెండ్ షిప్ అదిరింది
X
నందమూరి, మెగా అభిమానుల మధ్య చాలా రోజులుగా పోటీ ఉంది. అనేక సార్లు ఇది వైరంగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఫ్యాన్స్ రచ్చకెక్కిన సందర్భాలు ఉన్నా.. నిజానికి నందమూరి, మెగా హీరోల మధ్య ఫ్రెండ్ షిప్ బాగానే ఉంది. తరచుగా ఈ స్నేహాన్ని కెమేరా ముందే ప్రదర్శించిన అనుభవం కూడా ఈ రెండు వంశాల మధ్య ఉంది.

గతంలో మెగా60 బాష్ లో.. చిరును వాటేసుకుని మరీ అభినందించారు బాలయ్య. అప్పడు ఇదో సెన్సేషనల్ న్యూస్ అయింది. రీసెంట్ గా తన వందో చిత్రానికి చిరంజీవిని బాలయ్య ఆహ్వానించగా.. ఆ సినిమా గురించి, బాలయ్య గురించి తెగ పొగిడేశారు మెగాస్టార్. దీంతో మెగా, నందమూరి హీరోల మధ్య స్నేహం మరింతగా వికసించింది. ఈ ట్రెండ్ ని మరింతగా కంటిన్యూ చేస్తున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్.

ఏప్రిల్ 29న నారా రోహిత్ - తారకరత్నలు నటించిన రాజా చెయ్యి వేస్తే సందర్భంగా.. అభినందనలు చెబుతూ విషెస్ చెప్పాడు తేజు. 'ఈ నెల 29న విడుదల కానున్న రాజా చెయ్యి వేస్తే సక్సెస్ కావాలని కోరుకుంటూ.. తారక్ అన్నయ్య - నారా రోహిత్ లకు ఆల్ ది బెస్ట్' అంటూ వీడియోలో చెప్పాడు సాయిధరం తేజ్. ఆ వంశాలకు చెందిన కుర్రాళ్ల మధ్య కూడా మంచి స్నేహం ఉందని చెప్పడానికి.. ఈ ఒక్క వీడియో చాలు కదా.