Begin typing your search above and press return to search.
రిస్కీ కాంబినేషన్ తో మెగా హీరో
By: Tupaki Desk | 24 Jun 2019 7:42 AM GMTఇవాళ సుప్రీమ్ హీరో సాయి తేజ్ కొత్త సినిమా మొదలుకాబోతోంది. మారుతీ దర్శకత్వంలో గీతా 2 బ్యానర్ లో యువి సమర్పణలో బన్నీ వాస్ దీన్ని నిర్మించబోతున్నారు. దీంతో అయినా సాలిడ్ హిట్ ఒకటి పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిత్రలహరితో తేజు కొంత రిలాక్స్ అయ్యాడు కానీ నిజానికి అది మరీ గొప్పగా చెప్పుకునేంత హిట్ కాదు. తన మార్కెట్ లో సగం ధరకే అమ్మడంతో సేఫ్ అయ్యింది కానీ సుప్రీమ్ టైంలో ఉన్న డిమాండ్ కు తగ్గట్టు బిజినెస్ చేసుంటే లాస్ వెంచర్ గానే మిగిలేది.
మరోపక్క దర్శకుడు మారుతీ కూడా డిఫెన్స్ లోనే ఉన్నాడు. భలే భలే మగాడివోయ్ తర్వాత పదే పదే హీరోకో హీరోయిన్ కో ఏదో ఒక లోపం లేదా రోగం పెట్టి ఒకే తరహాలో కథలు రాసుకుంటున్న ఇతనికి శైలజారెడ్డి అల్లుడు గట్టి షాక్ ఇచ్చింది. సో దీంతో మరోసారి గట్టిగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం పడింది. ఇంకోవైపు హీరోయిన్ రాశి ఖన్నా తొలిప్రేమ తర్వాత ఏమంత చెప్పుకోదగ్గ ఫామ్ లో లేదు. శ్రీనివాస కళ్యాణం డిజాస్టర్ తర్వాత కనిపించనే లేదు. తమిళ సినిమాల్లో బిజీ అయ్యింది.
ఇన్ని సమీకరణాలు ఫైనల్ గా తేజు మీద ఒత్తిడి తెస్తాయి. చిత్రలహరి కూడా రిస్క్ తీసుకుని ఫ్లాప్ లో ఉన్న దర్శకుడికే ఛాన్స్ ఇచ్చిన సాయి తేజ్ ఇప్పుడు కూడా మారుతీ విషయంలో అదే నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి రోజు పండగే అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరి ఇది తేజుకు కోరుకున్న హిట్టు ఇచ్చి అందరికి పండగలా నిలిచే సినిమా అవుతుందో లేదో వేచి చూడాలి