Begin typing your search above and press return to search.

హీరోలే కథలు రాస్తున్నారా ?

By:  Tupaki Desk   |   12 March 2019 8:17 AM GMT
హీరోలే కథలు రాస్తున్నారా ?
X
ఒకప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ కథలు ఆయనే రాసుకుని దర్శకత్వం వహించి నిర్మించి ఇలా ఒకేసారి రకరకాల బాధ్యతలు నిర్వహించి అబ్బురపరిచె వారు. దానవీరశూరకర్ణ లాంటి సినిమాలు అదే విధంగా చరిత్ర సృష్టించాయి. కృష్ణ గారు కూడా ఇలాంటి రిస్కుతోనే ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆ తర్వాత భాగ్య రాజ్ తన సినిమాలకు తనే కథలు రాసుకుని డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్స్ కొట్టడం అగ్ర దర్శకులకు సైతం ఈర్ష్య కలిగించేది.

ఈయన ఇచ్చిన కథలతో తమిళ్ తెలుగులో వేరే హీరోలు చేసినవి ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి కూడా. చంటి సుందరకాండ లాంటివి ఉదాహరణగా చెప్పొచ్చు. వీళ్ళ స్ఫూర్తి ఏమో కాని సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ కూడా ఇదే తరహాలో ఆలోచిస్తున్నాడట. కాకపోతే డైరెక్టర్ గా కాదు లెండి. ప్రస్తుతానికి రైటర్ గా. విశ్వసనీయ సమాచారం మేరకు తేజు తనే స్వంతంగా ఓ కథ రాసుకున్నాడట. డైలాగ్ వెర్షన్ లేకుండా కేవలం ఒక లైన్ ని డెవలప్ చేసుకుని దాని మీదే వర్క్ చేస్తూ ఫైనల్ గా ఓ కొలిక్కి తెచ్చాడట.

దీన్ని సినిమాగా మలిచేందుకు ఓ యంగ్ డైరెక్టర్ తో చర్చలు కూడా జరిపినట్టు వినికిడి. చిత్రలహరి తర్వాత ఈ కథతోనే సినిమా ఉన్నా ఆశ్చర్యం లేదు. అయినా తాను నమ్మిన దర్శకులందరూ క్యు కట్టి మరీ డిజాస్టర్లు ఇస్తుంటే తేజు మాత్రం ఏం చేస్తాడు. అందుకే స్వంతంగా స్టొరీ రాసుకున్నాడు కాబోలు. ఇది అధికారికంగా చెప్పలేదు కాని మెగా కాంపౌండ్ కు అతి సన్నిహితంగా మెలిగే వాళ్ళ నుంచి వచ్చిన న్యూస్. అయినా నిప్పు లేనిదే పొగ రాదుగా. విషయం లేనిదే ఇలాంటివి పొక్కవుగా