Begin typing your search above and press return to search.
ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఫిఫ్టీ కొట్టేశాడోచ్
By: Tupaki Desk | 26 March 2016 1:30 PM GMTసాయికార్తీక్.. టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్.. తమన్.. అనూప్ రూబెన్స్ లాంటి వాళ్లు పెద్ద సినిమాల్ని పంచుకుంటూ ఉంటే.. చిన్న-మీడియం రేంజి సినిమాల్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకెళ్లి పోతున్నాడు ఈ కుర్రాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే సంగీత దర్శకుడిగా 50 సినిమాలు పూర్తి చేసుకుని సంచలనం సృష్టించాడు సాయికార్తీక్. నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన ‘రాజా చెయ్యి వేస్తే’ సాయికార్తీక్ కు 50వ సినిమా కావడం విశేషం. ప్రస్తుతం సాయి కార్తీక్ చేతిలో అరడజనుకు పైగా సినిమాలుండటం విశేషం. అవన్నీ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
2008లో అబ్బో ఆడవాళ్లు అనే చిన్న సినిమాతో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయి కార్తీక్ కు సరైన బ్రేక్ రావడానికి చాలా కాలమే పట్టింది. ‘ఓం 3డి’ సినిమా రూపంలో తొలిసారి పెద్ద అవకాశం వచ్చింది. ఆ తర్వాత కృష్ణవంశీ సినిమా ‘పైసా’ అతడికి చాలా మంచి పేరు తెచ్చింది. ‘ఓం’ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ సాయి కార్తీక్ టాలెంటేంటో తెలుసుకుని ‘పటాస్’ సినిమాకు ఛాన్సిచ్చాడు కళ్యాణ్ రామ్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయి సాయికార్తీక్ ను బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా మార్చేసింది. టాలెంట్ ఎక్కడున్నా వెంటనే అవకాశాలిచ్చే నారా రోహిత్ కూడా సాయి కార్తీక్ మ్యూజిక్ కు ఇంప్రెస్ అయ్యాడు. ‘ప్రతినిధి’ దగ్గర్నుంచి తన ప్రతి సినిమాకూ అతడితోనే మ్యూజిక్ చేయించుకుంటున్నాడు. అసుర.. తుంటరి.. రాజా చెయ్యి వేస్తే.. ఇలా వరుసగా రోహిత్ సినిమాలన్నింటికీ సాయికార్తీకే సంగీత దర్శకుడు. సాయిధరమ్ హీరోగా తెరకెక్కుతున్న ‘సుప్రీమ్’కు కూడా సాయికార్తీకే మ్యూజిక్ ఇస్తున్నాడు.