Begin typing your search above and press return to search.
సాయి కార్తీక్ శకం స్టార్ట్ అయిందా?
By: Tupaki Desk | 15 April 2016 3:30 PM GMTమ్యూజిక్ డైరెక్టర్లుగా సత్తా చాటుకున్నాక.. సినిమాల సంఖ్య పెరగడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ ఉండదు. కానీ ఇప్పుడు సంగీత దర్శకుడు సాయికార్తీక్ నుంచి వస్తున్న సినిమాల సంఖ్యను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నెల రోజుల్లో మూడు మూవీస్ ఒకే మ్యూజిక్ డైరెక్టర్ నుంచి రావడం అంటే చిన్న మాట కాదు.
ఏప్రిల్ 14న విడుదలైన మంచు విష్ణు - రాజ్ తరుణ్ ల మల్టీ స్టారర్ మూవీ ఈడో రకం ఆడో రకంకు సాయికార్తీక్ సంగీతం అందించాడు. అలాగే ఈ నెల 29న విడుదలవుతున్న నారా రోహిత్ మూవీ రాజా చెయ్యి వేస్తేకి కూడా కంపోజర్ సాయి కార్తీకే. ఇక సాయిధరం తేజ్ మూవీ సుప్రీమ్ కి కూడా సాయి కార్తీక్ సంగీతం అందించాడు.
గత నెలలో విడుదలైన నారా రోహిత్ మూవీ తుంటరి - సందీప్ కిషన్ రన్ చిత్రాలకు కూడా సందీప్ కిషన్ మ్యూజిక్ డైరెక్టర్. అంటే మీడియం బడ్జెట్ మూవీస్ అన్నిటికీ కేరాఫ్ అడ్రస్ అవుతున్నాడు ఈ సంగీత దర్శకుడు. అన్నింటిలోనూ వైవిధ్యం ప్రదర్శించడంతో.. ఇప్పుడు ఆఫర్స్ క్యూ కట్టేస్తున్నాయి. చూస్తుంటే సాయికార్తీక్ శకం స్టార్ట్ అయిందేమో అనిపించక మానదు.