Begin typing your search above and press return to search.
బాహుబలిని నమ్మి 50 కోట్లు పెట్టేస్తున్నాడు
By: Tupaki Desk | 26 Oct 2016 5:30 PM GMT50 కోట్లుంటే ఒక భారీ బడ్జెట్ సినిమానే తీసేయొచ్చు. ఐతే అంత మొత్తం పెట్టి ఒక సినిమాకు సంబంధించి కొన్ని జిల్లాల హక్కుల్ని సొంతం చేసుకున్నాడు ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి. ఆయన ఇంత మొత్తం పెట్టుబడి పెట్టింది ‘బాహుబలి’ మీద కావడం విశేషం. రాయలసీమతో పాటు కృష్ణా.. ఉత్తరాంధ్ర జిల్లాల ‘బాహుబలిః ది కంక్లూజన్’ హక్కుల్ని సాయి కొర్రపాటే సొంతం చేసుకున్నాడు.
అన్ని ఏరియాల్లోనూ ఆయన రికార్డు రేటే పెట్టాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క రాయలసీమ హక్కుల కోసమే రూ.27 కోట్లు వెచ్చించడం విశేషం. బాహుబలిని మినహాయిస్తే రాయల సీమ హక్కులకు ఈ మొత్తంలో సగం పలికినా ఆశ్చర్యమే. ఇక ఉత్తరాంధ్ర.. కృష్ణా హక్కుల కోసం కూడా భారీగానే పెట్టుబడి పెడుతున్నాడు సాయి. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు కలిపి రూ.13.3 కోట్లు.. కృష్ణ జిల్లాకు రూ.9.5 కోట్లు పెట్టి రైట్స్ తీసుకున్నాడు.
మొత్తం బాహుబలి-2 మీద సాయి పెట్టుబడి రూ.50 కోట్లకు చేరుతోంది. ఐతే ఆ సినిమా మీద ఉన్న అంచనాల ప్రకారం చూస్తే సాయి చేస్తోంది పెద్ద రిస్కేమీ కాదని అనుకోవచ్చు. బాహుబలి-1 మీద భారీ పెట్టుబడి పెట్టినవాళ్లందరూ కూడా దాని మీద భారీగానే లాభాలందుకున్నారు. బాహుబలి-2 కూడా స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అన్న అంచనాలుండటంతో బయ్యర్లు ఎంత రేటు పెట్టినా ఢోకా ఉండదనే భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/