Begin typing your search above and press return to search.
మోత మొదలైంది... జక్కన్న కూడా ఆపలేడు
By: Tupaki Desk | 15 Aug 2015 8:08 AM GMTబాహుబలి ది బిగినింగ్ రికార్డులే ఇంకా పూర్తి కాలేదు. అఫ్పుడే ఈ సినిమా సీక్వెల్ రికార్డులు మొదలైపోయాయి. బాహుబలి పార్ట్ 2 కర్ణాటక హక్కులను ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి కైవసం చేసుకున్నారు. నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గానూ ఈయనకు మంచి సక్సెస్ ట్రాక్ ఉంది. బాహుబలి విషయంలో కర్నాటక కోసం రూ.9 కోట్లు ఇచ్చి.. అప్పట్లో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యాడీయన. అయితే... రిలీజ్ కూడా కాకుండానే.. భారీ లాభానికి రీసేల్ కూడా చేసేసి.. ఔరా అనిపించాడు కొర్రపాటి.
అయితే.. అంచనాలకు మించిన సంచలనాలు సృష్టించిన బాహుబలి.. కర్నాటకలోనే 33కోట్లకు పైగా వసూలు చేసి... శాండల్ వుడ్ జనాలకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బాహుబలి ది కంక్లూజన్' పై ఎక్స్ పెక్టేషన్స్ అందనంత స్థాయిలో ఉన్నాయి. అందుకే ఈ సినిమా హక్కులను కైవసం చేసుకోవాలని చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ప్రయత్నిస్తున్నారు.
బాహుబలి పార్ట్ 2 కర్నాటక రైట్స్ ను... ఎక్స్ పెక్ట్ చేయనంత ఫ్యాన్సీ రేటును చెల్లించి సాయికొర్రపాటి కైవసం చేసుకున్నారు. డిస్ట్రిబ్యూషన్ లో ఈయనకు సక్సెస్ రేషియో ఎక్కువే. రాజమౌళిపై సాయికి అపారమైన విశ్వాసం. ఇప్పటివరకూ నమ్మకాలని వమ్ముచేయని రికార్డ్ జక్కన్నది. చూద్దాం.. బాహుబలి కంక్లూడ్ అయ్యేలోపు మరెన్ని రికార్డులు సృష్టిస్తుందో.