Begin typing your search above and press return to search.
రుద్రమదేవి.. ఓ తీపికబురు
By: Tupaki Desk | 16 July 2015 6:00 AM GMTబాహుబలి రావడానికి కొన్ని నెలల ముందే ‘రుద్రమదేవి’ని విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నాడు గుణశేఖర్. కానీ ఓ పక్క పనులు అనుకున్న సమయానికి పూర్తికాలేదు. మరోవైపు బిజినెస్ అనుకున్న స్థాయిలో జరగలేదు. దీంతో బాహుబలికి ముందే తన సినిమాను విడుదల చేయాలన్న అతడి ఆశ నెరవేరలేదు. ఐతే అయ్యిందేదో అయ్యిందని ఆగస్టులో ‘రుద్రమదేవి’ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాడు గుణ. బిజినెస్ విషయంలో కొంచెం ఆందోళనగా ఉన్న గుణశేఖర్‌కు ఊరటనిస్తూ ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ‘రుద్రమదేవి’ కృష్ణా జిల్లా హక్కులను 2.80 కోట్లకు సొంతం చేసుకున్నాడు.
బాహుబలితో పోలిస్తే ఈ మొత్తం తక్కువే కానీ.. రుద్రమదేవి వరకు ఇది ఎక్కువే. ఓ స్టార్ హీరో సినిమా స్థాయిలో హక్కులు అమ్ముడవడంతో గుణశేఖర్ ఆనందానికి అవధులుండవేమో. ఇదే స్థాయిలో మిగతా ఏరియాల బిజినెస్ కూడా జరిగితే గుణశేఖర్ సేఫ్ అయిపోయినట్లే. తన కలల ప్రాజెక్టు కోసం ఎవరూ ఊహించని స్థాయిలో ఏకంగా రూ.70 కోట్ల దాకా బడ్జెట్ పెట్టాడు గుణశేఖర్. భారతదేశపు మొట్టమొదటి ౩డీ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రుద్రమదేవి పాత్రను అనుష్క పోషించగా, మరో ప్రధాన చారిత్రక గోనగన్నారెడ్డి పాత్రను హీరో అల్లు అర్జున్ పోషించారు. హీరో రానా, నిత్యామీనన్‌లు కీలక పాత్రల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించడం విశేషం. అనేక ప్రత్యేకతలున్న ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తేవాలని పట్టుదలతో ఉన్నాడు గుణ.