Begin typing your search above and press return to search.
టేస్టున్న ప్రొడ్యూసర్ తమిళ సినిమాపై పడ్డాడు
By: Tupaki Desk | 17 Feb 2016 5:30 AM GMTడిస్ట్రిబ్యూషన్ నుంచి నిర్మాణంలోకి వచ్చి మంచి పేరు సంపాదించిన నిర్మాతల్లో సాయి కొర్రపాటి ఒకడు. తొలి ప్రయత్నంలోనే ‘ఈగ’ లాంటి సెన్సేషనల్ మూవీని నిర్మించిన సాయి.. ఆ తర్వాత అందాల రాక్షసి - ఊహలు గుసగుసలాడే - దిక్కులు చూడకు రామయ్యా లాంటి సినిమాలతో తన టేస్టు చాటుకున్నాడు. ఈ మధ్య నిర్మాణంలో కొంచెం స్పీడు తగ్గించినప్పటికీ.. కంటెంట్ ఉన్న చిన్న సినిమాల్ని హోల్ సేల్ గా కొనేసి రిలీజ్ చేస్తూ తన బ్రాండ్ వాల్యూను నిలబెట్టుకుంటున్నాడు. రాజు గారి గది - జత కలిసే లాంటి సినిమాలతో మంచి ఫలితాన్ని అందుకున్న సాయి.. ఇటీవలే ‘గుంటూరు టాకీస్’ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్నాడు.
తాజాగా ఆయన కళ్లు ఓ తమిళ సినిమాపై పడ్డాయి. అదే.. ‘మిరుథన్’. జయం రవి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ‘యమపాశం’ పేరుతో తెలుగులోకి అనువదించిన సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం తమిళ - తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది ఈ చిత్రం. ఐతే తెలుగులో హడావుడిగా రిలీజ్ చేస్తుండటంతో ఈ చిత్రానికి థియేటర్లు ఎక్కడ దొరుకుతాయి, జనాలు ఎక్కడ పట్టించుకుంటారు అనుకుంటుండగా సాయి కొర్రపాటి లైన్లోకి వచ్చాడు. ఈ సినిమాను తన బేనర్ మీద రిలీజ్ చేస్తున్నాడు. ఇక తమిళ నిర్మాత గుండెల మీద చేయి వేసుకోవచ్చు. తెలుగులో మార్కెట్ కోసం చూస్తున్న జయం రవికి కూడా ఇది సంతోషాన్నిచ్చే విషయమే. హాలీవుడ్ లో పాపులర్ అయిన జాంబీ జానర్లో ఈ చిత్రం తెరకెక్కడం విశేషం. ఓ వైరస్ ప్రభావంతో మనుషులంతా రాక్షసుల్లా మారిపోతుంటే.. మిగతా ప్రపంచాన్ని కాపాడ్డానికి హీరో ఏం చేశాడనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. లక్ష్మీమీనన్ ఇందులో కథానాయిక. శక్తి సౌందర్ రాజన్ దర్శకుడు.