Begin typing your search above and press return to search.
చైతుతో మూడో కృష్ణుడికి వారాహి అండ
By: Tupaki Desk | 17 Sep 2016 3:30 PM GMTఅక్కినేని నాగ చైతన్య చకచకా సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. ఇప్పటివరకూ కెరీర్ లో ఎన్నడూ లేని రేంజ్ స్పీడ్ చూపించేస్తున్నాడు చైతు. చేతిలో చందూ మొండేటి-ప్రేమమ్.. గౌతమ్ మీనన్-సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలు రిలీజ్ కి రెడీగా ఉండగా.. మరో మూడు సినిమాలు ఒప్పేసుకున్నాడు. ఆశ్చర్యపోవాల్సిన సంగతి ఏంటంటే.. ఈ మూడు సినిమాలకు దర్శకుడి పేరులో కృష్ణ ఉండడం.
నాగ్ తో సాహసం శ్వాసగా సాగిపో చిత్రాన్ని తీసిన కళ్యాణ్ కృష్ణ.. చైతుతో ఓ సినిమా చేయనున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కృష్ణ అనే కొత్త దర్శకుడు ఓ సినిమా చేయనున్నాడు. రీసెంట్ గా జెంటిల్మన్ తో హిట్ కొట్టిన ఇంద్రగంటి మోహన్ కృష్ణకి ఓ సినిమా చేసేందుకు చై ఒప్పుకున్నాడు. ఇలా ముగ్గురు కృష్ణులతో చైతు సినిమాలు చేయనుండగా.. ఇంద్రగంటి తీయనున్న సినిమాని వారాహి బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించనున్నాడు. రీసెంట్ గా జ్యో అచ్యుతనంద సక్సెస్ సాధించిన కొర్రపాటి.. కొత్త సినిమాని జనవరి నుండి ప్రారంభిస్తారని అంటున్నారు.
ఒకేసారి చేతిలో ఐదు ప్రాజెక్టులతో చైతు చూపిస్తున్న స్పీడ్ చూస్తుంటే.. ఇదంతా పెళ్లి సెటిల్ అయిన జోరులాగే కనిపిస్తోంది కదూ.