Begin typing your search above and press return to search.
కొత్తోళ్ళు.. కాంబినేషన్లు.. దెబ్బేశాయ్
By: Tupaki Desk | 16 May 2016 11:30 AM GMTఅయితే కొత్త దర్శకులు.. లేకపోతే కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ కాంబినేషన్లు.. ఈ రెండింటిలో ఏవి హిట్టిస్తాయి? రెండూ హిట్టివ్వవు. ఈ రెండింటిలో ఏదైనా కూడా.. కొత్త కంటెంట్ ఉన్నప్పుడు మాత్రమే హిట్టు వస్తుంది. ఈ విషయాన్ని లేటుగా తెలుసుకున్నారు పంపిణీదారుడు సాయి కొర్రపాటి.
సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో.. ఈగ సినిమాతో మొదలు పెట్టి.. దిక్కులు చూడకు రామయ్య వరకు.. ఆయన సినిమాల్లో కంటెంట్ సూపర్ అని అందరూ అనుకున్నారు. కాని అక్కడి నుండి గ్రాఫ్ మారిపోయింది. వారాహి చలన చిత్రం వారు తీసిన.. తుంగభద్ర.. ఇప్పుడు 'రాజా చెయ్యి వేస్తే' సినిమాలు ఘోరంగా ఫెయిల్ అయ్యాయ్. అంతేకాదు.. ఈ సినిమాల్లో స్టయిల్ కోషెంట్ తప్పిస్తే కంటెంట్ కూడా లేకపోవడంతో.. నష్టం కోట్లలో వచ్చింది. పైగా నారా-నందమూరి కాంబినేషన్ అన్నా కూడా జనాలు చూడలేదు. ఇక సాయి కొర్రపాటి చేతిలో ఉంది రెండు సినిమాలు. ఒకటి శ్రీనివాస్ అవసరాల తీస్తున్న జో అచ్యుతానంద.. ఇంకోటి చంద్రశేఖర్ ఏలేటి తీస్తున్న మనమంతా. శ్రీనివాస్ సినిమాలో నాగశౌర్య అండ్ నారా రోహిత్ ల కాంబినేషన్ ఉండగా.. ఏలేటి సినిమాలో మోహన్ లాల్ వంటి స్టార్ క్యాస్ట్ ఉన్నారు. కాని ఈ రెండు సినిమాల్లోని కంటెంట్ మాత్రమే వారాహి వారికి బ్రేకిచ్చేది.
ఇక సాయి కొర్రపాటి కూడా.. కొత్తాళ్లతోనూ.. కాంబినేషన్లతోనూ.. ఎవరైనా సినిమా సజెస్ట్ చేస్తే మాత్రం వద్దండీ అనేస్తున్నారట. ఈ రెండు సినిమాల రిజల్టు చూశాకనే తదుపరి సినిమాలపై ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారట.