Begin typing your search above and press return to search.

నాలుగో సింహం కాస్త మూడో క‌న్నైంది

By:  Tupaki Desk   |   3 Nov 2016 9:30 AM GMT
నాలుగో సింహం కాస్త మూడో క‌న్నైంది
X
సాయికుమార్ అన‌గానే... క‌నిపించని నాలుగో సింహ‌మేరా ఈ పోలీస్ అని క‌ళ్లెర్ర‌జేసి గ‌ర్జించే అగ్ని పాత్రే గుర్తుకొస్తుంది. ఇర‌వ‌య్యేళ్ల క్రితం `పోలీస్ స్టోరీ` సినిమాలో సాయికుమార్ చేసిన ఆ పాత్రని, అందులో ఒదిగిపోయి విశ్వ‌రూపం చూపించిన వైనాన్ని ప్రేక్ష‌కులు ఇప్ప‌టికీ గుర్తు చేసుకుంటుంటారు. నేటికీ రియాలిటీ షోల‌లోనూ - సినిమాల్లోనూ స్పూఫ్ రూపంలో క‌నిపిస్తూ న‌వ్విస్తుంటుంది ఆ పాత్ర‌. అయితే ప్రేక్ష‌కుల‌పై అంతటి ప్ర‌భావం చూపించిన నాలుగో సింహం పాత్ర‌ని మ‌రిపించేలా తాజాగా మ‌రో పాత్ర‌ని చేశానని సాయికుమార్ చెబుతున్నాడు.

ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌ల `మ‌న‌లో ఒక‌డు` అనే సినిమా తెర‌కెక్కింది. మీడియా నేప‌థ్యంలో సాగే చిత్ర‌మ‌ది. అందులోనే సాయికుమార్ మూడో క‌న్ను అనే టీవీ ఛాన‌ల్‌ కి ఎండీ అయిన ప్ర‌తాప్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఆ పాత్ర‌పై సాయికుమార్ చాలా న‌మ్మ‌కంగా ఉన్నాడు. నాలుగో సింహం అగ్ని కాస్త మూడు క‌న్ను ప్ర‌తాప్ అయ్యాడ‌ని, ఇకపైన అగ్ని పాత్ర‌ని కాకుండా నా పేరు చెప్ప‌గానే మూడో క‌న్ను ప్ర‌తాప్‌నే గుర్తు చేసుకుంటార‌ని సాయికుమార్ చెప్పుకొస్తున్నాడు. అయితే సాయి చెప్పిన‌ట్టుగా ఆయ‌న మూడోక‌న్ను ప్ర‌తాప్ అనే మ‌రో ప‌వ‌ర్‌ ఫుల్‌ పాత్ర‌ని చేసుంటే చేసుండొచ్చేమో కానీ... అది నాలుగో సింహం పాత్ర‌ని మాత్రం మ‌రిపించ‌లేద‌నేది సినీ ప్రేమికుల మాట‌. నిజంగా ఒక పాత్ర జ‌నాల్లోకి వెళ్లాక, అది ప్రేక్ష‌కుల‌పై ప్ర‌భావం చూపించ‌డం మొద‌లుపెట్టాక ఆ స్థాయిలో మ‌రెన్ని పాత్ర‌లొచ్చినా ప్రేక్ష‌కులు మాత్రం మ‌రిచిపోలేరు. దేనికున్న గుర్తింపు దానికుటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/