Begin typing your search above and press return to search.
స్టార్ రైటర్ బిగ్ పే-ప్యాకెట్?
By: Tupaki Desk | 9 Oct 2018 5:16 AM GMTబుర్రా సాయిమాధవ్.. పరిచయం అఖ్కర్లేని పేరు ఇది. టాలీవుడ్ లో బిగ్ షాట్. ట్యాలెంటెడ్ రైటర్ అతడు. తనదైన పదవిన్యాసంతో .. సెన్సిబుల్ డైలాగ్స్‌తో సత్తా చాటిన స్టార్ రైటర్ బుర్రా. అందుకే ఇంతింతై వటుడింతై అన్న చందంగా పరిశ్రమలో ఎదిగేస్తున్నాడు. ప్రతిభకు పట్టంగట్టే పరిశ్రమలో ఎంతో శ్రమించి - ఎన్నో స్ట్రగుల్స్ ని ఎదుర్కొని చివరికి అనుకున్నది సాధించుకున్న రైటర్ ఆయన. ఎవ్వెరి డాగ్ హాజ్ ఏ డే! అని నమ్మి కృషి - పట్టుదలతో తాను అనుకున్న గోల్ ని రీచ్ అయ్యాడు సాయిమాధవ్.
నేడు ఆయన కలానికి కోటానుకోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఆ కలాన్ని నమ్ముకుని కోట్లాది రూపాయల బిజినెస్ సాగుతోందంటే అతిశయోక్తి కాదు. ఆ కలం పవరే వేరు. పరుచూరి సోదరులు తర్వాత త్రివిక్రమ్ - కొరటాల - క్రిష్ - పూరి జగన్నాథ్ - కోన వెంకట్ - వక్కంతం వంశీ వంటి వాళ్లు రాసే మాటలకు ఎంతో క్రేజు ఉంది. ఆ కోవలోనే .. తనకంటూ ఓ స్టయిల్ ఉందని - ఇతరులతో పోలిస్తే అంతకుమించి అని నిరూపించాడు బుర్రా సాయిమాధవ్. కృష్ణం వందే జగద్గురుం - మళ్లీ మళ్లీ ఇది రాని రోజు - ఖైదీ నంబర్ 150 లాంటి చిత్రాలకు బుర్రా సాయిమాధవ్ పని చేశారు. ఇవన్నీ తనని బ్లాక్ బస్టర్ రైటర్ ని చేశాయి. అందుకే ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీ బెస్ట్ సినిమాలన్నీ బుర్రా ఖాతాలోనే ఉన్నాయి.
ఎన్టీఆర్ బయోపిక్ (కథానాయకుడు - మహా నాయకుడు)లు రెండిటికి సాయిమాధవ్ మాటలు అందిస్తున్నారు. క్రిష్ తో పాటు కథా చర్చల్లోనూ పాల్గొన్నారు. ఇక టాలీవుడ్ ప్రతిష్ఠాత్మక చిత్రం - సైరా- నరసింహారెడ్డికి ఆయనే మాటల రచయిత. పరుచూరి సోదరులతో కలిసి ఈ సినిమాకి పని చేస్తున్నారు. ఇక ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ RRR కు ఆయనే రచయిత. అన్నీ క్రేజీ ప్రాజెక్టులకు పని చేస్తున్నారు సాయిమాధవ్. ఆక్రమంలోనే పారితోషికం పెరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి మల్టీస్టారర్ కోసం ఆల్మోస్ట్ పారితోషికం డబుల్ అయ్యిందన్న మాటా వినిపిస్తోంది. ఈ సినిమాకి సాయిమాధవ్ రూ.75లక్షల మేర పారితోషికం అందుకుంటున్నారని రివీలైంది. అయితే అందుకు పూర్తి అర్హత సాయిమాధవ్ కి ఉంది. ఎన్నో కష్టాలు అనుభవించి.. శ్రమించి గొప్ప ప్యాషన్ తో అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదగగలిగాడు. అమ్మ- నాన్నలు కళాకారులు... డ్రామా ఆర్టిస్టులుగా సేవలందించిన చరిత్ర ఆ కుటుంబానికి ఉంది. ఆ క్రమంలోనే నటుడిగా - రచయితగా రూపాంతరం చెందిన సాయిమాధవ్ దశాబ్ధాల పాటు టాలీవుడ్ లోనే మనుగడ సాగించారు. అందుకే ఎవ్వెరి డాగ్ హాజ్ ఏ డే!