Begin typing your search above and press return to search.
7వ తరగతిలోనే ఆ పని చేసి తన్నులు తిన్న సాయి పల్లవి!
By: Tupaki Desk | 11 July 2022 9:32 AM GMTన్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి అంటే తెలియని సౌత్ సినీ ప్రియులు ఉండరు. 2015లో విడుదలైన మలయాళ బ్లాక్ బస్టర్ 'ప్రేమమ్' మూవీతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. 'ఫిదా'తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే ఇక్కడా ప్రేక్షకుల మనసు దోచేసింది. ఎక్స్పోజింగ్ కు ఆమడ దూరంలో ఉండే సాయి పల్లవి.. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషిస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
ఇకపోతే త్వరలోనే సాయి పల్లవి 'గార్గి' అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ మూవీకి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు.
తండ్రి కోసం కూతురు చేసే న్యాయ పోరాటం నేపథ్యంలో రూపొందిన కోర్టు డ్రామా మూవీ ఇది. ఇందులో మధ్య తరగతి కుటుంబానికి చెందిన స్కూల్ టీచర్ గార్గిగా సాయి పల్లవి నటించింది. 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై హీరో సూర్య, జ్యోతిక ఈ సినిమాను సమర్పిస్తుండగా తెలుగులో రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు.
జూలై 15న ఈ మూవీ తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇక మరోవైపు సాయి పల్లవి, రానా దగ్గుబాటి కలిసి నటించిన 'విరాట పర్వం' ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి తాజాగా నెట్‌ఫ్లిక్స్ ప్రారంభించిన 'మై విలేజ్ షో' అనే టాక్ షోలో రానా దగ్గుబాటితో కలిసి పాల్గొంది.
ఈ టాక్ షోకు గంగవ్వ హోస్ట్ గా వ్యవహరిస్తోంది. అయితే ఈ షోలో సాయి పల్లవి తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను సైతం షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే గంగవ్వ 'విరాట పర్వంలో రవన్న పాత్రకు నువ్వు లవ్ లెటర్ రాశావు కదా, నిజ జీవితంలో ఎవరికైనా లవ్ లెటర్ రాశావా..? అంటూ ప్రశ్నించింది.
అందుకు సాయి పల్లవి బదులిస్తూ.. 'నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు ఓ అబ్బాయికి లవ్ లెటర్ రాశాను. ఆ లెటర్‌ను నా పేరెంట్స్ చూశారు. నన్ను చాలా బాగా కొట్టారు' అని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఏడవ తరగతిలోనే లవ్ లెటర్ రాసి తల్లిదండ్రుల చేతుల్లో తన్నులు తిన్నానని సాయి పల్లవి స్వయంగా చెప్పడంతో.. ఇప్పుడీ విషయం నెట్టింట వైరల్ గా మారింది.