Begin typing your search above and press return to search.
మీ అభిమానానికి మించిన అవార్డు లేదు
By: Tupaki Desk | 19 Dec 2021 7:56 AM GMTనాని .. సాయిపల్లవి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన 'ఎం సి ఎ' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత వాళ్లిద్దరూ కలిసి నటించిన సినిమా ఇదే. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 24న రానున్న ఈ సినిమాలో బెంగాలీ యువతిగా సాయిపల్లవి కనిపించనుంది. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో అభిమానుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి సాయిపల్లవి ఎమోషనల్ అయింది. అలా ఎమోషనల్ అవుతూనే ఆమె మాట్లాడింది.
"అందరికీ నమస్కారం .. నేను కొన్ని విషయాలు మాట్లాడాలి .. ఒక టూ మినిట్స్ నాకు టైమ్ ఇవ్వండి. ఇక్కడికి వచ్చిన పెద్ద వాళ్లందరికీ చాలా థ్యాంక్యూ .. నానిగారి ఫ్యాన్స్ కి .. ఈ ఆడిటోరియంలో ఉన్న వారందరికీ థ్యాంక్యూ వెరీ మచ్. నాకు చాలా మాట్లాడాలని ఉంది .. కానీ తెలుగులో సరిగ్గా చెప్పలేకపోతే క్షమించండి. చాలామందికి కూడా ఒక డాన్సర్ కావాలనీ .. ఆర్టిస్ట్ కావాలని ఉంటుంది. కానీ వాళ్లలో కొంతమందికి మాత్రమే అవకాశం వస్తుంది. అలాంటి ఒక అవకాశాన్ని నాకు ఇండస్ట్రీ ఇచ్చింది. నన్ను నమ్మి ఇలా రోల్స్ ఇస్తున్నారు.
ఇప్పుడే అనిపించింది ఏ నమ్మకంతో నన్ను తీసుకుంటున్నారు అని. రాహుల్ గారు చెప్పారు .. నేను చాలా హార్డ్ వర్క్ చేశానని .. కానీ నాకు గుర్తులేదు. ఎందుకంటే ఆ రోల్ ను అంత ఎంజాయ్ చేస్తూ చేశాను. మీరు నన్ను యాక్సెప్ట్ చేయడం వల్లనే ఇంతలా కుదిరింది. ఫస్టు మూవీ తరువాత 'ఈ అమ్మాయి ఎందుకు?' అని మీరు అనుకుంటే మళ్లీ నేను వచ్చేదానిని కాదుగదా. ఇలాంటి ఒక స్టేజ్ ను నాకు ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్యూ. ఇలాంటి ఒక సినిమా చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది.
నేను ఏమనుకున్నానంటే ఎప్పుడైనా నేషనల్ అవార్డు .. ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు ఏడుస్తూ మాట్లాడతానేమోనని. కానీ ఈ రోజు నేను ఏడ్చేశాను .. ఒక యాక్టర్ గా ఈ ఫ్లాట్ ఫామ్ పై ఉండటమే నాకు పెద్ద అవార్డు. మీ అభిమానానికి మించిన అవార్డు లేదు. నేను చేసిన పాత్రలను గుర్తుపెట్టుకుని మరీ పిలుస్తున్నారు. నా ఫీలింగ్స్ ను మీకు అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నానో లేదో నాకే అర్థం కావడం లేదు. నిజంగా ఈ రోజున నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నేను థ్యాంక్యూ చెప్పగలను అంతే" అంటూ ముగించింది.