Begin typing your search above and press return to search.

మరో ఫిదా అనుకోవడానికి వీల్లేదు

By:  Tupaki Desk   |   21 Aug 2017 5:32 AM GMT
మరో ఫిదా అనుకోవడానికి వీల్లేదు
X
సాధారణంగా ఇతర భాషల్లో నుంచి తెలుగుతెరకు పరిచయం అయిన హీరోయిన్స్ గాని స్టార్స్ గాని ఇక్కడ ఒక్క హిట్ అందుకున్నారంటే చాలు.. ఇక వారు మొదట తీసిన ఇతర భాషల సినిమాలు డబ్ అయ్యి రిలీజ్ అవుతూనే ఉంటాయి. స్టార్ హోదా ఉన్నప్పుడే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కొందరు ప్రొడ్యూసర్స్ కూడా స్టార్స్ సినిమాస్ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కానీ ఒక్కోసారి ఆ సినిమాలు అనుకున్నంతగా ఫలితాన్ని ఇవ్వవు.. కానీ హిట్ అయితే మాత్రం హక్కులను పొందిన నిర్మాత పంట పండినట్టే.

అయితే ఇపుడు అదే తరహాలో ఫిదా బ్యూటీ సినిమాలపై పడ్డారు కొందరు నిర్మాతలు. ఫిదా సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫేమస్ అయిన సాయి పల్లవి గతంలో నటించిన మలయాళ సినిమాలను తెలుగులో డబ్ చేస్తున్నారు. ఆమె ప్రేమమ్ తర్వాత తీసిన రెండవ సినిమా "కాళి" మళయాళంలో బాగానే ఆడిందిలే. కేవలం నాలుగు కోట్లతో తెరకెక్కిన ఆ సినిమా దాదాపు కోట్లలో రాబట్టిందట. దీంతో తెలుగులో ఆ సినిమాను "హే పిల్లగాడా" అనే టైటిల్ తో అనువదిస్తున్నారు. ఫిదా సినిమా పాటలోని లైన్ ని తీసుకొని టైటిల్ పెట్టుకున్న ఈ మూవి స్టోరీ ఆ టైటిల్ కి తగ్గట్టుగా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆ కథ కొంచెం ఆగ్రహంతో కూడిన సన్నివేశాలతో ఉంటుంది. పైగా లవ్ స్టోరీ కానే కాదు. యాక్షన్ ఎలిమెంట్స్ మరియు యాంగర్ మేనేజ్మెంట్ అనేవి ప్రథమాంశాలు. మరి అలాంటి యాంగ్రీ కథకు ఇంత సాఫ్ట్ టైటిల్ ఎలా మ్యాచ్ అవుతుందంటున్నారు నెటిజన్లు. అలాగే ఇంచు మించుగా రిలీజ్ కి రెడీ కాబోతున్న అర్జున్ రెడ్డి స్టైల్ లో ఉంటుందనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. అందుకే ఈ టైటిలేంటి రాజా అని అందరికీ సందేహం వస్తోంది. మరో ఫిదా అనుకోవడానికి వీల్లేకుండా ఉంది.

మరి ఫిదా సినిమాలో తన నటనతో 50 కోట్లను అందించి అదృష్ట లక్ష్మిగా మారిన సాయి పల్లవి "హే పిల్లగాడా" తో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఒకవేళ ఆడియన్స్ కు ఇది సాయి పల్లవి సినిమా కాదు.. డల్కర్ సినిమా అని తెలిసిపోయిందనుకో.. సీన్ మారిపోయే ఛాన్సుంది.