Begin typing your search above and press return to search.
నాగశౌర్యకి సాయిపల్లవి ఆన్సర్ ఇదే
By: Tupaki Desk | 27 Feb 2018 7:14 AM GMTటాలీవుడ్ లో సెన్సేషన్స్ సష్టిస్తున్న హీరోయిన్ సాయి పల్లవి గురించి.. యంగ్ హీరో నాగశౌర్య గట్టి కామెంట్స్ నే చేశాడు. తనను అత్యంత ఎక్కువగా ఇరిటేట్ చేసిన హీరోయిన్ ఆమేనంటూ.. ఓపెన్ గానే చెప్పేశాడు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటించిన కణం మూవీ రిలీజ్ సందర్భంగా ఈ కామెంట్స్ హైలైట్ అయ్యాయి.
ఓ హీరోయిన్ పై హీరో ఇలా విమర్శలు చేయడం అరుదుగానే కనిపిస్తుంది. దీనికి రియాక్ట్ కావాలంటూ సాయిపల్లవిని ఓ ఇంటర్వ్యూలో అడిగారు. సహజంగా అయితే.. రిటర్న్ కౌంటర్ ఏదో ఒకటి ఇస్తుందనే అనుకుంటాం. కానీ ఈ భామ ఇక్కడే తన స్పెషాలిటీ చూపించింది. 'నేను నాగశౌర్య ఇంటర్వ్యూ చదవగానే.. వెంటనే విజయ్ సార్ కి కాల్ చేశాను. నా కారణంగా ఇబ్బందులు ఏమైనా ఏర్పడ్డాయా అని అడిగాను. ఆయన అలాంటివేమీ లేవన్నారు. ఆ తర్వాత దర్శకుడికి కూడా ఫోన్ చేసి అడిగాను. ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండాలని అనుకునే మనస్తత్వం నాది. అయితే నాగ శౌర్య ఇలా చెప్పడం సంతోషం కలిగించింది' అంటోంది సాయి పల్లవి.
'ఒకరి కారణంగా ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పేయాలి. మనం ఓ దర్శకుడి కోసం పని చేస్తాం. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఆయన దగ్గరకు తీసుకెళ్లవచ్చు. నేను నాగశౌర్య ఫీలింగ్స్ గౌరవిస్తున్నాను. కానీ నేను ఎవరినీ బాధపెట్టకూడదని అనుకుంటాను. నేను అతనని ఎలా హర్ట్ చేశానో నాకు ఇంకా అర్ధం కావడం లేదు. అదే ఇంకా బాధపెడుతోంది' అని చెప్పింది సాయి పల్లవి.