Begin typing your search above and press return to search.
పిక్ టాక్: చూపు తిప్పుకోలేని అందం.. గార్జియస్ బ్యూటీ సొంతం..!
By: Tupaki Desk | 19 Dec 2021 3:42 AM GMT'ఫిదా' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ప్రేమమ్ బ్యూటీ సాయి పల్లవి.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. అందం - అభినయం - అదృష్టం కలబోసిన ఈ బ్యూటీ.. డ్యాన్సులతో అదరగొడుతుంది. గ్లామర్ షోకు ఆమడ దూరంలో ఉంటూ.. కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటూ వస్తోంది. అందుకే చేసింది తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
ఇటీవల 'లవ్ స్టోరీ' సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.. ఇప్పుడు 'శ్యామ్ సింగ రాయ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నాని హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 24న నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. శనివారం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో హీరోయిన్ సాయి పల్లవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఆన్ స్క్రీన్ లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోనూ పద్దతిగా కనిపించే సాయి పల్లవి.. శ్యామ్ సింగ రాయ్ ఈవెంట్ లో అంతే పద్దతిగా కనిపించింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో బేబీ పింక్ లెహంగాలో ధరించిన ఈ బ్యూటీ అందరి కళ్ళు తనవైపు తిప్పేలా చేసుకుంది. ఆమె మొహంలోని చిరు నవ్వు మరింత అందాన్ని తీసుకొచ్చింది. అయితే ఎప్పుడూ ఉంగరాల జుట్టుతో కనిపించే గార్జియస్ క్వీన్.. ఈసారి లూస్ హెయిర్ లో కనిపించి మనసు దోచుకుంది.
'శ్యామ్ సింగరాయ్' సినిమాలో దేవదాసి పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో ఆకట్టుకుంది. ఇది తన కెరీర్ లో గుర్తుండి పోయే పాత్ర అవుతుందని అందరూ భావిస్తున్నారు. డ్యాన్స్ కు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే ఈ బ్యూటీ.. ఈ సినిమాలో మరోసారి తన డ్యాన్సులతో మంత్రముగ్దులను చేయబోతోందని అర్థం అవుతోంది. లేటెస్టుగా వచ్చిన 'ప్రణవాలయ' పాటలో సాయి పల్లవి సాంప్రదాయ నృత్యానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.
'నేను లోకల్' తర్వాత నాని తో కలిసి సాయి పల్లవి చేసిన రెండో సినిమా ''శ్యామ్ సింగ రాయ్'' రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిహారికా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మించారు. సాయి పల్లవికి ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాని తెలుగుతో పాటుగా తమిళ కన్నడ మలయాళ భాషల్లో క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నారు. మరి నేచురల్ బ్యూటీకి ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.