Begin typing your search above and press return to search.
గాలివానకి కూలిన స్టేజ్ .. అయినా ఆగని సాయిపల్లవి!
By: Tupaki Desk | 6 Jun 2022 3:19 AM GMTకథానాయకుడిగా 'విరాటపర్వం' సినిమా రూపొందింది. సుధాకర్ చెరుకూరి - సురేశ్ బాబు నిర్మించిన ఈ సినిమాకి వేణు ఉడుగుల దర్శకత్వం వహించాడు. ఇది 1990లలో జరిగే కథ .. నక్సలిజం నేపథ్యంలో సాగే కథ. నక్సలైట్ నాయకుడిగా రానా నటించిన ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా సాయిపల్లవి కనిపించనుంది. సురేశ్ బొబ్బిలి ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను కర్నూలులో ప్లాన్ చేశారు.
కర్నూల్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఈ ఈవెంట్ కి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్యామల యాంకరింగ్ తో ఈ కార్యక్రమం మొదలైన కొంతసేపటికి ఒక్కసారిగా విపరీతమైన ఈదురుగాలులు వీచాయి. ఆ గాలి ఉద్ధృతికి స్టేజ్ జ్ పైన ఉన్న ఎల్ ఈడీ స్క్రీన్ పడిపోయింది. ఒక్కసారిగా పవర్ సప్లై ఆగిపోయింది. ఆ ప్రదేశమంతా అంధకారం అలుముకోవడంతో జనంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అదే సమయంలో వర్షం కూడా మొదలైంది. మళ్లీ సెట్ చేసి కార్యక్రమాన్ని నడిపించడం కుదరదనే విషయం టీమ్ కి అర్థమైంది.
అయితే ఊహించని ఈ పరిమాణామానికి ఆర్టిస్టులు ఎవరూ డిజప్పాయింట్ కాలేదు. గాలి - వాన కాస్త తగ్గితే స్టేజ్ పైకి వద్దామని అనుకున్న సాయిపల్లవి .. అలాగే స్టేజ్ పైకి వచ్చేసింది. ఆ గాలివానలోనే స్టేజ్ పై ఆమె మైక్ లో మాట్లాడింది. ఆమెను చూడటం కోసం అంత గాలివానలోను ప్రేక్షకులు అలా తడుస్తూ నిలబడిపోవడం విశేషం. వాళ్ల కోసమే అలాంటి వాతావరణంలోను సాయిపల్లవి స్టేజ్ పైకి వచ్చింది. ఒక వైపున రానా .. మరో వైపున నవీన్ చంద్ర ఆమెకి గొడుగులు పట్టగా, ఆమె చెప్పదలచుకున్న నాలుగు మాటలు చెప్పేసింది. ఆ మాటలు వినిపించినా లేకపోయినా వాటి సారమైతే సినిమా చూడమనే గదా.
1990లలో .. గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా కావడంతో, అందుకు తగిన ఓణీ పరికిణీలతో పల్లెటూరు అమ్మాయిగా సాయిపల్లవి కనిపించనుంది. ఈ సినిమాకి సురేశ్ బొబ్బిలి అందించిన పాటలకి మంచి మార్కులు పడ్డాయి. సాయిచంద్ .. జరీనా వాహెబ్ .. ప్రియమణి .. నందితా దాస్ .. ఈశ్వరీ రావు .. నివేదా పేతురాజ్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. అందరిలో ఆసక్తినీ .. అంచనాలను పెంచుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి.