Begin typing your search above and press return to search.

సాయిపల్లవి నోటి వెంట తెలుగు తిట్లు

By:  Tupaki Desk   |   20 Jun 2017 11:43 AM GMT
సాయిపల్లవి నోటి వెంట తెలుగు తిట్లు
X
హీరోయిన్ సాయి పల్లవి అంటే దాదాపుగా సినీ ప్రియులు అందరూ గుర్తు పట్టేస్తారు. ఇప్పటివరకూ తెలుగు ఆడియన్స్ కు ఈ భామతో పరిచయం లేకపోయినా.. మలయాళ ప్రేమమ్ చిత్రం ద్వారా దాదాపుగా అందరికీ సుపరిచితం అయిపోయింది ఈ కుట్టి. ఇప్పుడీ సాయి పల్లవి తెలుగులో నటించేస్తోంది.

వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఫిదా చిత్రం ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది సాయి పల్లవి. సహజంగా పక్క భాషల భామలు.. తెలుగు సినిమా చేసినా తమ గొంతు వినిపించే ధైర్యం చేయరు. కానీ సాయిపల్లవి మాత్రం తన తొలి సినిమాతోనే సహజమైన సౌందర్యంతో పాటు తన స్వర మాధుర్యాన్ని కూడా వినిపించేయబోతోంది. ఇప్పటికే ఫిదా చిత్రం కోసం డబ్బింగ్ కూడా చెప్పేస్తోంది. తాజాగా సాయి పల్లవి డబ్బింగ్ చెబుతున్న ఓ చిన్న వీడియోను కూడా యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు దిల్ రాజు. ఎంత అందంగా తెలుగు పలుకులను ఈ భామ పలుకుతోందంటే.. నిజంగా తెలుగమ్మాయే ఈ మాటలు మాట్లాడేస్తోందా అనిపించక మానదు.

ముందు తడబడ్డా.. తర్వాత స్పష్టంగా మాట్లాడేస్తోంది. అంతే కాదండోయ్ గట్టిగా తిట్టేస్తోంది కూడా. 'బాడకోవ్.. బలిసిందేరా.. బొక్కలిరగ్గొడతా' అని చెప్పి మళ్లీ అదే డైలాగ్ ను 'బద్మాష్.. బలిసిందేరా.. బొక్కలిరగ్గొడతా' అంటూ రెండో వెర్షన్ కూడా చెప్పింది. సెన్సార్ వాళ్లు ఒప్పుకోకపోతే అప్పుడు సెకండ్ వెర్షన్ పెడతారన్న మాట. కానీ సాయి పల్లవి నోటి వెంట తిట్లు కూడా బాగున్నాయిలే.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/