Begin typing your search above and press return to search.

సాయి పల్లవి అల బాలీవుడ్ లోకి..!

By:  Tupaki Desk   |   8 Dec 2022 2:59 AM GMT
సాయి పల్లవి అల బాలీవుడ్ లోకి..!
X
ప్రస్తుతం ఉన్న కథానాయికలలో ఎలాంటి గ్లామర్ షో చేయకుండా తన అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తూ కోట్ల మంది అభిమానులను సంపాదించిన హీరోయిన్ సాయి పల్లవి. అంతకుముందు డాన్సర్ గా పలు టీవీ షోస్ లో ఆడిషన్స్ ఇచ్చిన సాయి పల్లవి మళయాళ ప్రేమం తో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకుంది. ఆ మూవీలో మలార్ పాత్రలో సాయి పల్లవి నటించిన తీరు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఇక ఆ క్రేజ్ తోనే తెలుగులో ఫిదా ఛాన్స్ అందుకుంది. ఫిదా నుంచి సాయి పల్లవి తెలుగులో వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది.

సౌత్ భాషలన్నిటిలో అవకాశాలు అందుకుంటూ వస్తున్న సాయి పల్లవి కెరీర్ లో ఫస్ట్ టైం ఒక బాలీవుడ్ మూవీ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తుంది. రామాయణ కథతో తెరకెక్కుతున్న ఒక సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో నటించడానికి ఓకే చేసిందట. రణ్ బీర్ కపూర్ రాముడు పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో హృతిక్ రోషన్ రావణుడిగా చేస్తారని టాక్. అంతకుముందే సాయి పల్లవికి బాలీవుడ్ ఆఫర్ లు చాలా వచ్చినా వాటిని కాదని చెప్పింది అమ్మడు. ఇక ఇప్పుడు వచ్చింది సీత పాత్ర కాబట్టి ఆమె వద్దని చెప్పలేకపోయింది.

ఇప్పటికే ప్రభాస్ రాముడుగా చేస్తూ ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ సినిమా వస్తుంది. ఈ మూవీ తర్వాత అల్లు అరవింద్ కూడా మరో రామాయణ ఇతిహాసంతో ఒక సినిమా అనుకుంటున్నారు. మరి ఇన్ని సినిమాలు ఒకే కథతో రావడం ఏంటో వారికే తెలియాలి. సాయి పల్లవి సీత పాత్రలో చేస్తే మాత్రం ఆ ప్రాజెక్ట్ కి స్పెషల్ ఎట్రాక్షన్ వచ్చినట్టే. తెలుగులో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ కి లేడీ పవర్ స్టార్ ట్యాగ్ కూడా ఇచ్చారు.

తను చేసే ప్రతి పాత్రకి పూర్తి న్యాయం చేస్తూ సినిమా సినిమాకు తన పాపులారిటీ పెంచుకుంటూ వస్తున్న సాయి పల్లవి ఇక మీదట బాలీవుడ్ ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అవుతుంది. సీత పాత్ర సాయి పల్లవి చేస్తే ఊహించిన దానికన్నా కూడా ఆమె నటన అందరినీ మెస్మరైజ్ చేస్తుందని చెప్పొచ్చు. సాయి పల్లవి ఒప్పుకుంది అంటేనే ఆ సినిమాలో సంథింగ్ స్పెషల్ ఉన్నట్టే లెక్క.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.