Begin typing your search above and press return to search.
తొందర పడిన సాయి పల్లవి.. తట్టుకోగలదా?
By: Tupaki Desk | 3 July 2022 6:12 AM GMTన్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇటీవలె `విరాట పర్వం`తో ప్రేక్షకులను పలకరించింది. విలక్షణ నటుడు రానా దగ్గుబాటి హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న విప్లవాత్మక ప్రేమ కథా చిత్రమిది. ఎన్నో అంచనాల నడుమ జూన్ 17న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. అయినప్పటికీ వెన్నెలగా నటించిన సాయి పల్లవికి మాత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే ఈ అందాల భామ విరాట పర్వం ఇంకా థియేటర్స్ లో ఉండగానే మరో సినిమాతో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది.
సాయి పల్లవి రీసెంట్ గా `గార్గి` అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. గౌతమ్ రామచంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి `96` ఫేమ్ గోవింద్ వసంత సంగీతాన్ని అందించారు. రామచంద్రన్, ఐశ్వర్యా లక్ష్మి, థామస్ జార్జ్, గౌతమ్ రామచంద్రన్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. జూలై 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది.
తమిళంలో 2డీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై హీరో సూర్య, జ్యోతిక విడుదల చేస్తున్నారు. అలాగే తెలుగు, కన్నడ భాషల్లోనూ ఈ మూవీ అలరించబోతోంది. అయితే `గార్గి` రిలీజ్ డేట్ విషయంలో సాయి పల్లవి అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. అరడజన్ కు పైగా చిత్రాలతో జూలై నెల మొత్తం బుక్కైపోయింది. జూలై 14 అంటే గార్గి విడుదలకు ఒక్కరోజు ముందు టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా ఎన్. లింగుసామి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `ది వారియర్` ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ ద్విభాషా చిత్రంపై ఇప్పటికే భారీ బజ్ నెలకొంది. ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ ఆ బజ్ ను మరో లెవల్ కు తీసుకెళ్తున్నారు. అలాగే జూలై 21న `కార్తికేయ 2`, జూలై 22న `థ్యాంక్యూ`, జూలై 28న `హిట్ 2`, జూలై 29న `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రాలు రాబోతున్నాయి. ఈ చిత్రాలతో పోలిస్తే `గార్గి`కి అంతగా హైప్ లేదు. పోనీ మంచి హైప్ క్రియేట్ చేద్దామంటే టైమ్ లేదు.
విడుదలకు ఇంకా పదకొండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంత తక్కువ సమయంలో `గార్గి`ని మూడు భాషల్లో ప్రమోట్ చేసి ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం అంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి తొందర పడిందంటూ పలువురు సినీ ప్రియులు భావిస్తున్నారు. అసలు జూలైలో `గార్గి` విడుదలైతే.. టాక్ బాగుతున్నా అన్ని చిత్రాల నడుమ సాయి పల్లవి తట్టుకోగలదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.