Begin typing your search above and press return to search.
ప్చ్..! ఇరుకు కారవాన్ లో చీర కట్టేప్పుడు..!!
By: Tupaki Desk | 23 Dec 2020 8:48 AM GMTఅడక్కపోతే అమ్మయినా పెడుతుందా? అంటే డౌటే. సమస్య ఇదీ అని చెప్పకపోతే ఎలా తెలుస్తుంది. అలాంటి ఒక సమస్య వచ్చినప్పుడు ఎంతో ధైర్యంగా దానిని తన దర్శకుడికి చెప్పి పరిష్కారం కనుగొందిట సాయి పల్లవి. అందుకేగా ఈ అమ్మడు అంటే తన గురించి తెలిసినవారంతా పడి చచ్చేది!
అది ఫిదా షూటింగ్ టైమ్. అప్పట్లో తాను చీర కట్టుకోవాల్సిన సన్నివేశానికి రెడీ అవుతోంది. అయితే చీర ఎక్కడ కట్టుకోవాలి. తనకో కారవాన్ ఉంది. అందులోకి వెళ్లి చీర కట్టుకునే ప్రయత్నం చేస్తుంటే చాలా అసౌకర్యంగా అనిపించిందట. అసలే ఇరుకు కారవాన్ కావడంతో చీర కట్టుకునేందుకు నానా ఇబ్బంది ఎదురైంది. అయితే అదే విషయాన్ని నేరుగా దర్శకుడు శేఖర్ కమ్ముల వద్దకు వెళ్లి అడిగేసిందట సాయి పల్లవి.
ఆమె సహనటుడు వరుణ్ తేజ్ పొడగరి.. తనకు పెద్ద కారవాన్ ఉంది. అయినా అక్కడికి వెళ్లకుండా సాయి పల్లవి తన దర్శకుడు శేఖర్ కమ్ముల వద్దకు వెళ్లి ఆమె అసౌకర్యాన్ని వివరించారు. శేఖర్ తనకు అండగా నిలిచి సౌకర్యం విషయంలో రాజీ పడవద్దని చెప్పారట.
మనం మనదైన స్వరం కలిగి ఉండటం చాలా ముఖ్యం అని అతను ఆమెకు నేర్పించారట. అభిప్రాయాలను బలంగా ఎలా వినిపించాలో నేర్పించిన వ్యక్తిగా సాయి పల్లవి కమ్ములను గౌరవిస్తారు. తనకు ఆయన గౌరవం ఇస్తారు. మనం మన అభిప్రాయాన్ని చెప్పకపోతే.. నోరు విప్పకపోతే ఎవరు అండగా నిలుస్తారు? కమ్ముల నేర్పించినది ఇదే!! అని సాయి పల్లవి వెల్లడించారు. ట్విస్ట్ ఏమిటంటే... వరుణ్ తేజ్ ఆమె అసౌకర్యం గురించి తెలుసుకున్నప్పుడు.. అతను తన గదిని ఉపయోగించుకోమన్నారట. తద్వారా తనకు కావాల్సిన దాని విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేకుండా పోయిందని సాయి పల్లవి వెల్లడించారు.