Begin typing your search above and press return to search.

సాయిపల్లవికి ఇప్పుడు వర్కవుట్ అవుతుందా?

By:  Tupaki Desk   |   11 Aug 2019 11:34 AM IST
సాయిపల్లవికి ఇప్పుడు వర్కవుట్ అవుతుందా?
X
ఫిదాతో ఒక్కసారిగా టాలీవుడ్ దృష్టి మొత్తం తనమీద పడేలా చేసిన హైబ్రిడ్ పిల్ల భానుమతిగా అదరగొట్టిన సాయి పల్లవికి చాలా తక్కువ టైంలోనే కెరీర్ రివర్స్ గేర్ లో వెళ్తోంది. ముఖ్యంగా తెలుగులో ఆశించిన స్థాయిలో తన సినిమాలు ఈ మధ్యకాలంలో అంతగా వర్క్ అవుట్ కావడం లేదు. సూర్యతో చేసిన ఎన్జికె పాత్ర ఏకంగా విమర్శలను కూడా తెచ్చింది. గత ఏడాది తెలుగులో చేసిన ఒకే ఒక్క స్ట్రెయిట్ మూవీ పడి పడి లేచే మనసు సైతం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

ఇప్పుడు అనుకోని అతిధి పెరుత్ మరో కొత్త సినిమా మలయాళం డబ్బింగ్ రూపంలో వస్తోంది. ఇది ఏప్రిల్ లో అతిరన్ పేరుతో కేరళలో రిలీజైంది. సైకోలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ అక్కడ ఓ మాదిరిగా ఆడింది కాని మరీ రికార్డులు సృష్టించే రేంజ్ అయితే కాదు. దీన్నే అనుకోని అతిధిగా తీసుకొస్తున్నారు. అసలే మార్కెట్ డల్ గా ఉన్న తరుణంలో ఇలా డబ్బింగ్ సినిమా సాయి పల్లవికి ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

ప్రస్తుతానికి తెలుగులో సాయి పల్లవి కమిట్ అయిన సినిమాలు రెండు ఉన్నాయి. అందులో విరాటపర్వం ఒకటి. రానాకు జోడిగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. రానా యుఎస్ నుంచి రాగానే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. రెండోది తనకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ములతో నాగ చైతన్య హీరోగా చేస్తున్నది. ఈ రెండు తనకు మరోసారి పెద్ద మలుపుగా నిలుస్తాయనే నమ్మకంతో ఉందీ బ్యూటీ.