Begin typing your search above and press return to search.

సాయిపల్లవి ఇంట్లో పెళ్లిగోల పెరిగిపోయినట్టుందే!

By:  Tupaki Desk   |   12 July 2022 11:30 AM GMT
సాయిపల్లవి ఇంట్లో పెళ్లిగోల పెరిగిపోయినట్టుందే!
X
టాలీవుడ్ తెరపై చూసుకుంటే సౌందర్య .. స్నేహా .. నిత్యామీనన్ వంటి కథానాయికలు ప్రత్యేకంగా కనిపిస్తారు. స్కిన్ షో చేయకుండా స్టార్ డమ్ ను సాధించినవారుగా నిలుస్తారు. వీళ్లందరిలో సాయిపల్లవి స్థానం మరింత ప్రత్యేకమైనదిగా అనిపిస్తుంది.

ఎందుకంటే సాయిపల్లవి నటనలోనే కాదు .. డాన్స్ లోను నెంబర్ వన్. ఆమె డాన్స్ లోని స్పార్క్ ను అభినందించనివారంటూ ఉండరు. సాయిపల్లవితో కలిసి డాన్స్ చేయాలనుందని మెగాస్టార్ అనడం, ఆమె సాధించిన క్రేజ్ కి ఒక ఉదాహరణ.

ఇక సాయిపల్లవి ఏ సినిమా చేసినా ఆ కథలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ఆమె నటనలోని సహజత్వం వలన, ఆ కథ తెరపై కాకుండా మన మధ్యలో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అలాంటి సాయిపల్లవి నుంచి ఇటీవల 'విరాటపర్వం' వచ్చింది. ఆ సినిమా వసూళ్ల సంగతి అలా ఉంచితే, ఆ పాత్రలో ఆవిష్కరించిన నటనతో సాయిపల్లవి మరో మెట్టుపైకి చేరుకుంది. అలాంటి సాయిపల్లవి తన తాజా తమిళ చిత్రమైన 'గార్గి'తో ఈ నెల 15వ తేదీన ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు .. కన్నడ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

రీసెంట్ గా ఈ సినిమా నుంచి తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒక సామాన్యమైన కుటుంబానికి చెందిన యువతి, ఒక కేసులో చిక్కుకున్న తన తండ్రిని విడిపించడానికి చేసిన పోరాటమే ఈ సినిమా కథ .. అనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. 'ఆడపిల్లను కదా' అంటూ తల్లి ధోరణి పట్ల గార్గి అసహనాన్ని ప్రదర్శించడం ట్రైలర్ లో కనిపిస్తుంది. 'ఆడపిల్లల పట్ల గల వివక్షను గురించిన అంశాన్ని గురించి కూడా ఈ సినిమాలో ప్రస్తావించారా?' అనే ప్రశ్న తాజా ఇంటార్వ్యులో సాయిపల్లవికి ఎదురైంది. అందుకు ఆమె తనదైన స్టైల్లో స్పందించింది.

"సాధారణంగా ఏ ఇంట్లోనైనా అబ్బాయిలకి ఉండే స్వేచ్ఛ అమ్మాయిలకి ఉండదు. మా ఇంట్లో నన్ను పెళ్లి చేసుకోమని తరచూ మా పేరెంట్స్ అడుగుతుంటారు. వాళ్లు ఆ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా .. "అదే అబ్బాయినైతే ఇలా త్వరగా పెళ్లి చేసి పంపించేయాలని చూస్తారా?" అని నేను అడుగుతూ ఉంటాను. ఇలాంటి సన్నివేశాలే ఈ సినిమాలోను కనిపిస్తాయి.

సందేశం ఇస్తున్నట్టుగా కాకుండా ఆలోచింపజేసేదిగా ఈ సినిమా ఉంటుంది" అని చెప్పుకొచ్చింది. సాయిపల్లవి మాట వరసకి చెప్పిందా? లేదంటే నిజంగానే తన ఇంట్లో పెళ్లిగోల పెరిగిపోయిందా? అనే చర్చనే ఇప్పుడు నడుస్తోంది.