Begin typing your search above and press return to search.

ఎర్ర చీరలో మలార్.. పారాహుషార్

By:  Tupaki Desk   |   2 Feb 2017 6:38 PM GMT
ఎర్ర చీరలో మలార్.. పారాహుషార్
X
మలయాళీ బ్యూటీ సాయి పల్లవిని టాలీవుడ్ ప్రేక్షకులు ఇంకా ఒక్క సినిమాలో కూడా చూడలేదు. అయినా.. సరే ఈ బ్యూటీ దాదాపు సినీ లవర్స్ అందరికీ పరిచితమే. అందుకు కారణం.. మలయాళ ప్రేమమ్ మూవీ. నాగచైతన్య చేసిన ప్రేమమ్ లో శృతి హాసన్ చేసిన పాత్రను.. మలయాళ వెర్షన్ లో చేసిన బ్యూటీ సాయిపల్లవి.

మొహంపై మొటిమలు కనిపిస్తున్నా మినిమం మేకప్ కూడా లేకుండా సాయి పల్లవి చేసిన ఈ యంగ్ టీచర్ అయిన మలార్ పాత్రలో.. కుర్రాళ్లను మాయలో పడేసింది. తాజాగా ఈమె చేసిన ఒక ఫోటో షూట్ లో ఎర్ర చీరలో కనిపించింది ఈ బ్యూటీ. చీరకట్టులో ఈ సుందరాంగి ఎంత సెక్సీగా ఉందంటే.. ఏ మోడ్రన్ డ్రెస్ లో కూడా ఇండియన్ అమ్మాయిలను ఇంత ఆకర్షణీయంగా కనిపించడం కష్టం. చీరలో చూపించగలిగే ఉన్న అందాలకు అబ్రివేషన్ చెబుతోందా అన్నట్లుగా ఉంది సాయి పల్లవి.

ఇప్పటివరకూ టాలీవుడ్ ప్రేక్షకులకు సాయిపల్లవి కనిపించలేదనే కొరత ఉన్నా.. త్వరలో మెగా హీరో వరుణ్ తేజ్ మూవీతో ఆ లోటు తీరిపోనుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫిదా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సాయి పల్లవి.. తెలుగు ఆడియన్స్ ను కూడా మాయ చేసేందుకు త్వరలో వచ్చేస్తోంది.