Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ సైలెంట్ అయిపోయిన సాయి ప‌ల్ల‌వి.. ఫ్యాన్స్ వ‌ర్రీ!

By:  Tupaki Desk   |   17 Sep 2022 8:30 AM GMT
మ‌ళ్లీ సైలెంట్ అయిపోయిన సాయి ప‌ల్ల‌వి.. ఫ్యాన్స్ వ‌ర్రీ!
X
సాయి పల్లవి అంటే తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు. డాన్సర్‌గా ప‌లు టీవీ షోల్లో పాల్గొని మంచి గుర్తింపు సంపాదించుకున్నఈ ముద్దుగుమ్మ.. మలయాళ సూపర్ హిట్ 'ప్రేమమ్‌' మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించింది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'ఫిదా' మూవీతో ఇటు టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ చిత్రంలో భానుమతిగా తన సహజ నటనతో ప్రేక్షకులకు బాగా చేరువైంది.

'ఫిదా' అనంతరం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస పెట్టి సినిమాలు చేసిన సాయి పల్లవి.. ఎలాంటి గ్లామర్ షో చేయకపోయినా తనదైన టాలెంట్ తో అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో విపరీతమైన ఫాలోయింగ్ లో సంపాదించుకున్న సాయి ప‌ల్ల‌విని.. లేడీ ప‌వ‌ర్ స్టార్ అని కూడా అంటుంటారు.

అయితే ఏమైందో ఏమో కానీ సినిమాల విషయంలో సాయిపల్లవి జోరు తగ్గిపోయిన‌ట్లు క‌నిపిస్తోంది. గ‌త ఏడాది 'లవ్ స్టోరీ', 'శ్యామ్ సింగ‌రాయ్‌' చిత్రాల‌తో డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. చాలా రోజుల పాటు కొత్త ప్రాజెక్ట్స్ ను ప్ర‌క‌టించ‌కుండా మౌనం వ‌హించింది. ఆ స‌మ‌యంలో సాయి ప‌ల్ల‌వి పెళ్లి చేసుకోబోతోంద‌ని, అందుకే కొత్త ప్రాజెక్ట్స్ ను ప్ర‌క‌టించ‌డం లేద‌ని ప్ర‌చారం జ‌రిగింది.

సాయి ప‌ల్ల‌వి న‌ట‌న‌కు గుడ్ బై చెప్ప‌బోతోంద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఎట్ట‌కేల‌కు ఈ వార్త‌ల‌కు తెర దించుతూ ఆమె 'గార్గి' మూవీని ప్ర‌క‌టించింది. గౌతమ్ రామచంద్రన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. తెలుగు, తమిళం, కన్నడ భాష‌ల్లో జూలై 15న విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌లం అయింది.

ఇక ఈ సినిమా నుంచైనా సాయి ప‌ల్ల‌వి వ‌రుస ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేస్తుందేమో అని అభిమానులు ఎంత‌గానో ఆశ‌ప‌డ్డారు. కానీ, అలా జ‌ర‌గ‌డం లేదు. సినిమాల ప‌రంగా సాయి ప‌ల్ల‌వి మ‌ళ్లీ సైలెంట్ అయిపోయింది. 'గార్గి' విడుద‌ల త‌రువ‌త సాయి ప‌ల్ల‌వి నుంచి ఒక్క కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ కూడా రాలేదు. అస‌లు ఆఫ‌ర్లు రావ‌డం లేదా..? లేక వ‌చ్చిన‌వి న‌చ్చక వ‌దులుకుంటుందా..? అన్న‌ది తెలియ‌క ఆమె ఫ్యాన్స్ తెగ‌ వ‌ర్రీ అయిపోతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.