Begin typing your search above and press return to search.
ఆ 'హీరోయిన్'కి గ్లామర్ అనే పదమే నచ్చదట!
By: Tupaki Desk | 29 April 2020 10:50 AM GMTసాయిపల్లవి. ఈ బ్యూటీ పేరు దక్షిణ సినీ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ‘ఫిదా’ మూవీతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో సాయిపల్లవి తెలంగాణ యాసలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేగాక ఈ నేచురల్ బ్యూటీ విభిన్నమైన సినిమాల ఎంపిక చేసుకుంటూ మంచి నటిగా పేరొందుతుంది. పాత్రకు తగ్గట్లుగా హావ భావాలను ఎంతో చక్కగా ప్రదర్శిస్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది. ఈ చెన్నై భామ ప్రస్తుతం తెలుగులో ‘విరాట పర్వం’ సినిమా చేస్తోంది. అంతేగాక రెండోసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్‌స్టోరీ అనే సినిమా చేస్తుంది. ఈ మూవీలో నాగచైనత్య హీరోగా నటిస్తున్నాడు.
ఇక తాజాగా సాయిపల్లవి మీడియాతో మాట్లాడుతూ.. గ్లామర్ షో చేయకపోవడం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. ఫిదా - పడిపడి లేచే మనసు సినిమాలలో సాయి పల్లవి మేకప్ లేకుండా నటించి.. అందరినీ ఫిదా చేసింది. తనకు మేకప్ అంటే అసలు ఇష్టముండదట. మేకప్ వేసుకోవడం వల్ల తన నేచురల్ అందం పోతుందని.. మేకప్ లేకుంటనే బాగుంటానని అంటుంది. ఇక గ్లామరస్‌గా కనిపించేందుకు అస్సలు ఒప్పుకోనని అంటుంది. తనకు గ్లామర్ అనే పదమే నచ్చదని నేచురల్ గా ఉండటమే ఇష్టమని చెప్తుంది. ఫిదా మూవీలో ఓ సీన్ కోసం మోకాళ్ల వరకు ఉండే స్కర్ట్ వేసుకుంది సాయిపల్లవి. మొదట ఆ డ్రెస్ వేసుకోవడానికి సాయి పల్లవి అసలు ఒప్పుకోలేదట. అయితే ఆ సీన్ కీ ఆ డ్రెస్ వేసుకోవడం చాలా అవసరం కావడంతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆ సీన్ ప్రాధాన్యం చెప్పడంతో.. ఒప్పుకొని వేసుకుందట. అయితే ఇక పై మాత్రం అసలు అలాంటి డ్రెసులు వేసుకోనని సాయిపల్లవి తేల్చిచెప్పేసింది.