Begin typing your search above and press return to search.
డాక్టర్.. డ్యాన్సర్.. హీరోయిన్.. అక్క..
By: Tupaki Desk | 4 July 2016 7:37 AM GMTఆ మధ్య కొంతమంది తెలుగు హీరోలను అసలు మీరు యాక్టింగ్ కెరియర్ ఎందుకు ఎంచుకున్నారు అంటే.. అబ్బే ఏముంది సార్.. నిజజీవితంలో చాలా ప్రొఫోషన్లలో దిట్టలుగా వెలగాలని అనిపిస్తుంది.. కాని కుదరదు.. అదే యాక్టర్ అయితే ఏ రోల్ కావాలంటే ఆ రోల్ చేసేయొచ్చు అని చెప్పేశారు. నిజంగానే అది నిజం అని చాలామంది నమ్ముతారు. కాని ఒక్క మినిట్ వెయిట్ చేయండి బాస్.
అదిగో ''ప్రేమమ్'' ఫేం బ్యూటి సాయిపల్లవిని చూడండి. అమ్మడు ఆ సినిమాలో తన యాక్టింగ్ తో మలర్ పాత్రలో ఇరగదీసింది. కాని ఈమె కేవలం ఒక సింపుల్ హీరోయిన్ మాత్రం కాదు. అందరూ డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యా అంటారు. కాని ఈమె మాత్రం డాక్టర్ చదువుతూ యాక్టర్ అయ్యింది. డా. సాయి పల్లవి సెంతామరై అంటూ ఈ మధ్యనే తన ఫైనల్ ఎం.బి.బి.ఎస్ డిగ్రీ కూడా అందుకుంది. ఒక ప్రక్కన డాక్టర్ గా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ మరో ప్రక్కన యాక్టింగ్ అంటే పెద్ద విషయమే. ఇక తన డ్యాన్సుతో ఎలాగో ఇరగదీస్తోంది.
ఇవన్నీ ఒక యాంగిల్ అయితే.. సాయి పల్లవికి తన ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం. ముఖ్యంగా తన చెల్లెలు పూజ అంటే ఎనలేని ప్రేమ. అదిగో మొన్న జరిగిన సైమా 2016 అవార్డుల కార్యక్రమానికి కూడా ఆమెను తీసుకొచ్చింది. అక్కడ అక్కాచెల్లెళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ప్రేమ కురిపిస్తుంటే.. ఆ సీన్ చూడ్డానికే కన్నుల పండుగగా ఉంది.