Begin typing your search above and press return to search.
లిప్పు లాకులు తప్పు కాదట.. కానీ చెయ్యదట!
By: Tupaki Desk | 23 Dec 2018 2:30 PM GMTఎవరూ చేయనిది మనం చేస్తేనే అది ప్రత్యేకత. అందరూ చేసేదే మనం చేస్తే అందులో స్పెషల్ ఏముంది? విజయ్ దేవరకొండకు క్రేజ్ వచ్చిందంటే రొటీన్ కు భిన్నమైన సినిమాలు చేస్తూ రెగ్యులర్ హీరోలకు భిన్నంగా ప్రవర్తించడం వల్లే కదా. హీరోయిన్ల విషయం తీసుకుంటే సాయి పల్లవి స్పెషల్. 'ఫిదా' సినిమాలో భానుమతి పాత్రతో అందరినీ మెస్మరైజ్ చేసిన సాయి పల్లవి తరచుగా ఏదో ఒక విషయంలో తను మిగతా హీరోయిన్లకు భిన్నమని ప్రూవ్ చేస్తూనే ఉంటుంది.
తాజాగా లిప్ లాకుల విషయంపై మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. లిప్ లాక్ సీన్లలో నటించనని.. పొట్టి దుస్తులు వేసుకోనని చెప్పింది. అలా అని వాటికేమీ వ్యతిరేకం కాదట.. ఆ సీన్లలో తప్పేమీ లేదుగానీ తనకు సౌకర్యంగా ఉండదు కాబట్టే అలాంటివి చేయనని తెలిపింది. అంతే కాదు బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం.. అడ్వర్టైజ్మెంట్లలో నటించడం లాంటివి కూడా తనకు ఇష్టం లేదట. సినిమాల ద్వారా తనకు కావాలిసినంత డబ్బు వస్తోందని.. ఇక ఆదాయం కోసం వేరే దారి వెతుక్కోవాల్సిన అవసరం లేదని తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది.
ఇమేజ్ ఉన్న హీరోయిన్ ఒకరోజు యాడ్ షూటింగ్ లో పాల్గొంటే లక్షల కొద్దీ డబ్బు వచ్చి పడుతున్న ఈ రోజుల్లో యాడ్స్ వద్దు అని చెప్తున్న సాయి పలవి సంథింగ్ స్పెషలే. ఇక మూతి ముద్దులంటారా.. సీనియర్ హీరోయిన్ల దగ్గరనుండి నిన్న మొన్న వచ్చిన 'హుషారు' హీరోయిన్ ప్రియా వడ్లమాని వరకూ లిప్పులాకుల హద్దులు చెరెపేస్తున్నారు. అవి కూడా చేయనని తేల్చి పారేసిందంటే మామూలు విషయం కాదు కదా. ఏదేమైనా హైబ్రిడ్ పిల్ల అని సాయి పల్లవి మళ్ళీ ప్రూవ్ చేసింది.